Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..!

Authored By vamana sai | The Telugu News | Updated on: February 14, 2021, 9:36 am

Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింస్ ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా.. పూజా హెగ్డే ప్రేరణ గా నటిస్తున్నారు. విక్రమాదిత్య – ప్రేరణల ప్రేమ ఎంతో పవిత్రమైందని తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో క్లారిటి ఇచ్చాడు దర్శకుడు రాధాకృష్ణ.

prabhas-radhe-shyam-first-glimpse-and release date on 30 julai announced by makers

prabhas-radhe-shyam-first-glimpse-and release date on 30 julai announced by makers

యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ ని నిర్మిస్తుండగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ లోనే లైలా మజ్ఞు, దేవదాసు పార్వతీ, సలీం అనార్కలీ లను చూపించి విక్రమాదిత్య – ప్రేరణల ప్రేమ కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు రాధకృష్ణ. ఇక తాజాగా రిలీజ్ చేసిన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ కి జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉంది. విక్రమాదిత్య – ప్రేరణ ల లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Prabhas : రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక తాజాగా వచ్చిన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రాధే శ్యామ్ రిలీజ్ కాబోతోంది. ఇక హిందీ వెరషన్ కి మిథున్ మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తునట్టు అధికారకంగా వెల్లడించారు. కృష్ణం రాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్.. బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

 

 

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp