Home » Entertainment » Prabhas Radhe Shyam Movie Pre Release Business
Entertainment

Radhe Shyam : రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 11, 2022, 12:07 am
Advertisement

Radhe Shyam : చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. ఏ సినిమా రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది కామన్ అయిపోయింది. అందులోనూ కొన్ని సినిమాల కోసం అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరీ పెద్ద సినిమాలు అయితే.. వందల కోట్లే ఖర్చు పెడుతున్నారు. సినిమా తీయడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాను ప్రమోషన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సినిమా.. ప్రమోషన్స్ ద్వారా జనాల్లోకి ఎంత ఎక్కువ చేరితే ఆ సినిమాకు అంత పేరు వస్తుంది.బాహుబలి సిరీస్ కు కూడా జక్కన్న ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేసి సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాడు.తాజాగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.

Advertisement

అసలే.. ప్రభాస్.. పాన్ ఇంటర్నేషనల్ స్టార్.. ఆ మాత్రం ప్రమోషన్స్ ఉండకపోతే ఎలా.బాహుబలి కంటే ముందు ప్రభాస్ కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అదే బాహుబలి సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయిపోయాడు. నిజానికి.. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో సినిమాకు కూడా చాలా బిజినెస్ జరిగింది.ఎందుకంటే.. అది బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన తొలి సినిమా. దీంతో దాని ప్రమోషన్స్ కోసం మూవీ యూనిట్ కోట్లు ఖర్చుపెట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ నుంచి వచ్చిన మూవీ రాధే శ్యామ్.సాహో సినిమా పెద్దగా ఆడకపోయినా.. ప్రభాస్ స్టార్ డమ్ మాత్రం తగ్గలేదు. అదే జోరు..

Prabhas Radhe Shyam Movie pre release business

Advertisement

Radhe Shyam : సాహో ప్రభావం రాధే శ్యామ్ మీద ఉందా?

అదే స్టార్ హోదా. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఢీకొట్టే హీరో రాలేదు. ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రమే కాదు.. ఆయన మార్కెట్ కూడా అటువంటిదే.ఈ సినిమా.. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ కాబోతోంది. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించడం.. సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఒక్కసారిగా ఈ సినిమాకు హైప్ వచ్చేసింది.రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించగా.. ప్రీ రిలీజ్ బిజినెసే రూ.200 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. యూఎస్ లోనూ ఇప్పటికే అడ్వాన్స్ డ్ బుకింగ్ మొత్తం ఫుల్ అయిపోయాయి. కొద్ది సేపట్లో యూఎస్ లో మూవీ ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే ఇన్ని సంచలనాలను సృష్టించిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. రాధే శ్యామ్.. యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ను కాసేపట్లో దితెలుగున్యూస్ వెబ్ సైట్ లో అందిస్తాం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి