Radhe Shyam Trailer : ప్రేమ‌కి, విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే రాధే శ్యామ్.. ట్రైల‌ర్ విడుద‌ల‌

Authored By Sam C | The Telugu News | Published on: March 2, 2022, 3:30 pm

Radhe Shyam Trailer :యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం రాధే శ్యామ్. పూజా హెగ్డే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డ్డ ఈ సినిమా మార్చి 11 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యటానికి సిద్ధం అవుతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్, పూజా లుక్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ప్రేమ‌కి, విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే రాధే శ్యామ్ అనే డైలాగ్‌తో పాటు ప‌లు డైలాగ్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్‌గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది.

Prabhas radhe shyam Movie trailer released

Prabhas radhe shyam Movie trailer released

Radhe Shyam Trailer : ట్రైల‌ర్‌తో ఆస‌క్తి రేకెత్తించిన రాధే శ్యామ్

ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాదిత్య పేరుతో.. హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. 1970-80ల కాలం నాటి లవ్​ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమ, విధి మధ్య పోరాటంగా ఈ సినిమా ఉండనుంది. చిత్రంలో మెజీషియన్ విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్, పూజా హెగ్డేతో ప్రభాస్ చేసే రొమాంటిక్ ట్రాక్ అందరిని అక్కట్టుకుంటుందట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందట. సెకండాఫ్ లో లెక్కలేనన్ని మలుపులు ఉంటాయట. ఇక ఈ సినిమా ఐరిష్ జ్యోతిష్యుడు చెయిరో స్ఫూర్తితో తెరకెక్కిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp