
Prabhas and Jr NTR Multi Starrer Movie
Prabhas : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ నటించిన బృందావనం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనం సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆ తర్వాత మరో మూడేళ్లకే 2013లో ఎన్టీఆర్ – రాజు కాంబోలో రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చింది.
అయితే సినిమా అంచనాలు అందుకోలేకపోవచ్చు కాని.. నిర్మాతగా దిల్ రాజుకి మాత్రం మంచి లాభాలే తెచ్చిపెట్టిందని నిర్మాత రాజు ఓపెన్‌గా చెప్పారు. అయితే సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడంతో నష్టాలు రాలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఓ ఇంట్రస్టింగ్ కారణాన్ని నిర్మాత రాజు చెప్పారు. అసలు ఈ సినిమాకు ముందుగా అనుకున్న కథ వేరట. సెట్స్ మీదకు వెళుతోందనుకుంటోన్న టైంలో ప్రభాస్ రెబల్ సినిమా రిలీజ్ అయ్యిందట. అయితే కథ పరంగా తండ్రి మీద రివేంజ్ తీర్చుకోవడం అనే సిమిలారిటీస్ ఉండడంతో రేపు సినిమా రిలీజ్ అయ్యాక అందరూ రెబల్‌లా ఉందని అంటారని.. అప్పుడే వేరే కథ తీసుకున్నారట.
prabhas reason for JR NTR flop
రెబల్ రిలీజ్ అయ్యాక రామయ్యా వస్తావయ్యాకు ముందుగా అనుకున్న కథ ఒకేలా ఉన్నట్టు అనిపించడంతో అప్పటికప్పుడు హరీష్ శంకర్ మరో కథ రెడీ చేశాడట.కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, హడావిడిగా ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడం వలన సినిమా ప్రేక్షకులకు ఎక్కడో కనెక్ట్ కాలేదు. అలా ఆ సినిమా అంచనాలకు దూరంగా ఆగిపోయింది. ఒక వేళ రెబల్ కంటే తమ సినిమా ముందుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే.. కనీసం రెబల్ కథలా ఉందన్న కంప్లైంట్లు ఉన్నా టేకింగ్‌ను బట్టి అయినా తమ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యి ఉండేదేమో ? అని రాజు చెప్పారు. ఇక విచిత్రం ఏంటంటే రెబల్ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఫెయిల్యూర్‌గానే నిలిచింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.