Yash : కన్నడ సినిమా ఇండస్ట్రీ మన టాలీవుడ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే చాల చిన్నది. ఇక్కడ 50 కోట్లతో ఒక సినిమాను చేస్తే అదే 50 కోట్లతో కన్నడ ఇండస్ట్రీలో 5 సినిమాలు చేస్తారు. తెలుగులో రాజమౌళి రెమ్యునరేషన్ ఓ 50 కోట్లు అనుకుంటే అందులో 10వ వంతు రెమ్యునరేషన్ కన్నడలో సినిమాకు దర్శకత్వం వహిస్తే ఇచ్చే రెమ్యునరేషన్. అంత తేడా ఉంటుంది. ఇది కేవలం మన టాలీవుడ్ – కన్నడ ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడా. అదే బాలీవుడ్‌తో పోల్చుకుంటే గనక కన్నడ ఇండస్ట్రీలో మరో నాలుగురెట్లు వ్యత్యాసం ఉంటుంది.
అలాంటి చిన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో యష్ ఇప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ హీరోలకు దడ పుట్టిస్తున్నాడు. కథ ఏముందీ అంటూనే బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాడు. హిందీలో అల్లు అర్జున్ తన పుష్ప 100 కోట్ల మార్క్‌ను రిలీజ్ అయ్యాక చాలా రోజులకు రీచ్ అయితే, కేజీఎఫ్ 2తో మాత్రం యష్ మొదటి వారంలో రీచ్ అయిపోయాడు. అంతేకాదు, హిందీ హీరోలు ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ అందుకోవడంలో తడబడుతున్నారు. కానీ, మన సౌత్ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటడమే కాదు హిందీలో కూడా గట్టి ఛాలెంజ్ విసురుతున్నారు.
అయితే, కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ఇటు టాలీవుడ్ హీరోలకు అటు బాలీవుడ్ హీరోలకు గట్టిగానే వసూళ్ల పరంగా ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది యష్ గురించే. మాసీవ్ పర్ఫార్మెన్స్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను తలపించాడని 1970 లలో అమితాబ్ చేసినటువంటి సినిమాలను చేస్తూ యష్ ఆయన సినిమాలను గుర్తు చేస్తున్నాడని బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా కామెంట్ చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా యష్‌ను కేజీఎఫ్ 2ను పొగడ్తలతో ముంచేశాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 రాబడుతున్న వసూళ్ళతో ఇప్పుడు అందరి స్టార్ హీరోలకు బాక్సాఫీస్ వద్ద పెద్ద ఛాలెంజే ఎదురవబోతుంది.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.