Prabhas ; రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. అంతకుముందు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 4 ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. ‘ ఆదిపురుష్ ‘ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విడుదలైన ఈ సినిమా టీజర్ నిరాశ పరచడంతో బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు ప్రభాస్ అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగల డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ సినిమా చేస్తున్నారు. దీంతో స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సమయం పడుతుంది. అయితే స్పిరిట్ నీ ఉద్దేశిస్తూ సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా స్పిరిట్ సినిమా ఉంటుందన్నారు. యానిమల్ మూవీ తర్వాత నేను చేసే సినిమా స్పిరిట్ అని అన్నారు. దీంతో సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ ఈ రెండు సినిమాలతో పాటు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ సలార్ ‘ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. జగపతిబాబు, పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే నాగ అశ్విన్ డైరెక్షన్లో ‘ ప్రాజెక్ట్ కే ‘ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్ లోని భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశాపటాని లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.