
Prabhas : పెళ్లి పక్కన పెట్టి వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!
Prabhas : డార్లింగ్ ప్రభాస్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత క్రేజ్ మరింత పెంచుకుంటూ పోతున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్‌కి సాహో,రాధే శ్యామ్,ఆదిపురుష్ చిత్రాలతో వరుస ఫ్లాపలు వచ్చాయి. అయిన కూడా ఆయన క్రేజ్ ఏమి తగ్గలేదు. సలార్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ టేకింగ్ కి ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సలార్ తో బాక్సాఫీస్ ని ఊచకోత కోసిన ప్రభాస్.. కల్కితో మరోసారి ఉచకోత కోస్తున్నారు.
అయితే ఆదిపురుష్ సమయంలో ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట మీద నిలబడి చూపించారు ప్రభాస్. ఆ మాట ఏంటంటే? ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తా అని.. కుదిరితే మూడు సినిమాలు అయినా నా నుంచి వచ్చేలా చూస్తా అని గత ఏడాది జూన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు. ప్రభాస్ చెప్పినట్లుగానే ఆరోజు నుంచి ఏడాది కాలంలో మూడు సినిమాలతో అలరించారు డార్లింగ్ ప్రభాస్. గత ఏడాది చివరిలో సలార్ సీజ్ ఫైర్ తో వచ్చిన ప్రభాస్.. ఆరు నెలల గ్యాప్ తో కల్కి 2898 ఏడీ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం.. ఏడాది కాలంలో రెండు సినిమాలతో మీ ముందుకు వస్తా అన్నారు.. అన్నట్టే వచ్చి అదరగొట్టాడు. ఇక ప్రభాస్ నుండి రాబోతున్న మూడో సినిమా మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ అని తెలుస్తుంది.
Prabhas : రెండు వాగ్ధానాలు చేసిన ప్రభాస్..మొదటిది నెరవేర్చాడు, రెండోది ఎప్పుడో మరి..!
ఇక ప్రభాస్ ఇటీవల సలార్ శౌర్యాంగ పర్వం మూవీ మొదలు పెట్టాడు. ఈ సినిమాని మొదటి పార్ట్‌ని మించి తెరకెక్కించబోతున్నారు. ప్రశాంత్ నీల్.. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో స్ట్రాంగ్ డ్రామాని కథలో చొప్పిస్తున్నారు. ఇక ప్రభాస్ చేస్తున్న మరో మూవీ స్పిరిట్. ఇది సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే రాజా సాబ్ కోసం ప్రభాస్ కొంచెం కష్టపడి ఏదోలా సమయం కేటాయిస్తే సినిమా ఈ ఏడాదిలోనే పూర్తైపోతుంది. అదే జరిగితే కనుక ఏడాది వ్యవధిలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇచ్చిన మూడు సినిమాల కమిట్మెంట్ ని ఫుల్ ఫుల్ చేసినట్లు అవుతుంది. ఇక రెండో వాగ్ధానం ప్రభాస్ పెళ్లి. ఆయన తప్పకుండా చేసుకుంటానని చెప్పాడు కాని ఎప్పుడు, ఎక్కడ అనేది చెప్పలేదు. ఈయన పెళ్లిపై ఎన్నో ప్రచారాలు నడుస్తున్నా ప్రభాస్ క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.