Adipurush : బాహుబలి విడుదల కాకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం టాలీవుడ్ కే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మార్కెట్ విస్తరించింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించాక ప్రభాస్ తో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు నిర్మాతలు పోటీపడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే సినిమా చేయడం తెలిసిందే.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్.. మరియు పాటలకి వస్తున్నా రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. అనేక భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ బిజినెస్ ధరకు “ఆదిపురుష్” థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అమ్మినట్లు న్యూస్ లీక్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ₹170 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో “RRR” సినిమా ₹191 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. “ఆదిపురుష్” ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ షాపులు పడినా గాని ప్రభాస్ మార్కెట్ చెక్కుచెదరలేదు అని చెప్పటానికి “ఆదిపురుష్” బిజినెస్ నిదర్శనం అని చెప్పవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.