Adipurush : ఎంతటి తోపు హీరో అయినా ప్రభాస్ కి సలాం కొట్టాల్సిందే… ఆదిపురుష్ బిజినెస్ డీటైల్స్ చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush : ఎంతటి తోపు హీరో అయినా ప్రభాస్ కి సలాం కొట్టాల్సిందే… ఆదిపురుష్ బిజినెస్ డీటైల్స్ చూడండి !

Adipurush : బాహుబలి విడుదల కాకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం టాలీవుడ్ కే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మార్కెట్ విస్తరించింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించాక ప్రభాస్ తో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు నిర్మాతలు పోటీపడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే సినిమా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 May 2023,4:00 pm

Adipurush : బాహుబలి విడుదల కాకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం టాలీవుడ్ కే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మార్కెట్ విస్తరించింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించాక ప్రభాస్ తో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు నిర్మాతలు పోటీపడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే సినిమా చేయడం తెలిసిందే.

Prabhas View Adipurush Business Details

Prabhas View Adipurush Business Details

రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్.. మరియు పాటలకి వస్తున్నా రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. అనేక భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ బిజినెస్ ధరకు “ఆదిపురుష్” థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అమ్మినట్లు న్యూస్ లీక్ అయింది.

Adupurush Trailer Launch: Adipurush trailer launch: Prabhas, Kriti Sanon  attend Hyderabad event - The Economic Times

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ₹170 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో “RRR” సినిమా ₹191 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. “ఆదిపురుష్” ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ షాపులు పడినా గాని ప్రభాస్ మార్కెట్ చెక్కుచెదరలేదు అని చెప్పటానికి “ఆదిపురుష్” బిజినెస్ నిదర్శనం అని చెప్పవచ్చు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది