Hyper Aadi : పాపం అఖిల్ సార్థక్.. గాలి తీసేస్తోన్న హైపర్ ఆది, ప్రదీప్

Authored By Sam C | The Telugu News | Published on: March 10, 2022, 5:00 pm

Hyper Aadi : అఖిల్ సార్ధ‌క్.. మనోడు బిగ్ బాస్ షోతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఓటీటీలోను సందడి చేస్తున్నాడు. సిసింద్రి చిత్రం విడుద‌లైన మరుస‌టి రోజే ఇత‌ను జ‌న్మించడంతో కుటుంబ స‌భ్యులు త‌న‌కు అఖిల్ అని పేరు పెట్టాడ‌ని ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రిత‌మే ల‌వ్ ఫెయిల్ అయింద‌ని కాబ‌ట్టి ఇప్ప‌డు సింగిల్ అని చెప్తున్నాడు. హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో అఖిల్ మూడో స్థానం సంపాదించాడు. ప‌లు సీరియల్స్‌లోనూ న‌టించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో త‌ను తన‌లాగే ఉంటాన‌ని, నటించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్తున్నాడు. ఓటీటీ సీజ‌న్‌లో కాస్త స్టైల్ మార్చిన అఖిల్ చాలా కాన్ఫిడెంట్‌గా క‌నిపిస్తున్నాడు.

మ‌రోవైపు అఖిల్ డ్యాన్స్ షో ఢీలోను పార్టిసిపేట్ చేసిన విష‌యం తెలిసిందే. సుడిగాలి సుధీర్ స్థానంలో అఖిల్‌ని తీసుకు రాగా, మ‌నోడితో పెద్ద‌గా వినోదం లేద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఢీ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో అఖిల్‌ని ఓ ఆట ఆడుకున్నారు హైపర్ ఆది, ప్ర‌దీప్. మేం బాగా ప్రిపేర్ అయి వ‌చ్చాం అని ఆది అన‌గా, అవ‌స‌రం లేదు అని ప్ర‌దీప్ అంటాడు. దానికి ఆదిని ఇది నీ రేంజ్ అని అఖిల్ అన‌గా, నిన్నే అనింది అంటూ పంచ్ వేస్తాడు ప్ర‌దీప్. మ‌ధ్య‌లో కూడా మ‌నోడిపై పంచ్‌లు పేలాయి. జానీ మాస్ట‌ర్‌పై అఖిల్ కామెంట్ చేసిన సమ‌యంలో మ‌నోడితో ఆడుకున్నారు ప్ర‌దీప్, ఆది.

pradeep and Hyper Aadi satires on akhil

pradeep and Hyper Aadi satires on akhil

Hyper Aadi : అఖిల్ ప‌రిస్థితి దారుణంగా మారింది..

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా పాపులర్ అయిన అఖిల్ సార్థక్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు మోనాల్ గజ్జర్ తో క‌లిసి తెగ సంద‌డి పంచాడు. ఈ జంట‌ని చూసి చాలా మంది మురిసిపోయారు. అయితే వీరు మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఒక వెబ్ సిరీస్‌లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్ వెబ్ సిరీస్‌కి పెట్ట‌గా,ఇంత వ‌ర‌కు దాని ఆచూకీ అయితే లేదు. అఖిల్ ప్ర‌స్తుతం ఓటీటీలో ర‌చ్చ చేస్తుండ‌గా, ఎంత వ‌ర‌కు అల‌రిస్తాడో అని ఆస‌క్తిక‌రంగా మారింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp