Home » Entertainment » Pragathi Mahavadi Satires On Netizens Trolling For Her Latest Reel Video
Entertainment

Pragathi Mahavadi : నేను అలా కనిపించాలని అనుకోవడం లేదు!.. దేశోధ్దారకులారా అంటూ ట్రోలింగ్‌పై ప్రగతి సెటైర్లు

Authored By
aruna
The Telugu News | Published on: August 1, 2022, 9:20 pm
Advertisement

Pragathi Mahavadi : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రోలింగ్ అవుతుంది? ఎప్పుడు ఎవరి మీద నెగెటివ్ ప్రచారం మొదలవుతుంది? ఎప్పుడేం జరుగుతుందనేది చెప్పలేం. టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి నెట్టింట్లో చేసే ఫీట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. నాలుగు పదులు దాటుతున్నా కూడా ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది. వర్కవుట్లు చేస్తూ ఎంతో కష్టపడుతుంటుంది. ఆమె కష్టానికి అందరూ ఫిదా అవుతుంటారు. అయితే ఒక్కోసారి ఆమె చేసేది కాస్త అతి అనిపిస్తుంటుంది. ఆమె వర్కవుట్లు, డ్యాన్స్ వీడియోలు, వేసుకునే బట్టల మీద ట్రోలింగ్ నడుస్తుంటుంది. ప్రగతి గత రెండేళ్ల నుంచి ఇలా హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె చేసే ఈ విన్యాసాలు ఒక్కోసారి ముచ్చట గొలిపిస్తుంటే..

Advertisement

కొన్ని సార్లు చిరాకు పుట్టిస్తుంటాయి. కానీ తాజాగా ఆమె ఓ రీల్ వీడియో చేసింది. ఇందులో ఆమె ధరించిన దుస్తులు, వేసిన స్టెప్పులు చూసి.. నువ్ ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా? యంగ్ అమ్మాయివి అనుకుంటున్నావా? అలా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా? అంటూ ఇలా నానా రకాలుగా ఆమె మీద నెగెటివ్ కామెంట్లు చేశారు. దీనిపై ఆమె కాస్త సెటైరికల్‌గానే స్పందించింది. తన మీద ట్రోలింగ్ వచ్చినా కూడా వెనక్కి తగ్గేదేలే అని చెప్పినట్టు అర్థమవుతోంది. తానేమీ యంగ్‌గా కనిపించేందుకు ప్రయత్నించడం లేదని, తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నానని, ఇలా తన లైఫ్‌ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. దేశోద్దారకులారా అంటూ ట్రోలర్స్‌ను సంబోధించింది.

Pragathi Mahavadi Satires on Netizens Trolling For her Latest Reel Video

Advertisement

మీరు ఇలాంటి చెత్త కామెంట్లు చేసి దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అన్నట్టుగా ప్రశ్నించినట్టు కనిపిస్తోంది. అందుకే అలాంటి పదం వాడినట్టు అర్థమవుతోంది. ప్రగతి మాత్రం ఈ ట్రోలింగ్ మీద సీరియస్ అయినట్టుంది. ప్రగతి ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై అవకాశాలతో దూసుకుపోతోంది. మొన్నటి వరకు శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపించింది. నవ్వులతో అందరినీ కట్టిపడేసింది. ఈ మధ్యే ఎఫ్ 3 సినిమాలో మరోసారి కడుపుబ్బా అందరినీ పగలబడి నవ్వించేశారు. అలా ఇప్పుడు ప్రగతికి వచ్చే ఆఫర్లు కూడా, ఉన్న ఇమేజ్ కూడా మారిపోయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి