
Pragati Dance Going Crazy Video on instagram
Pragathi : సపోర్టింగ్ క్యారెక్టర్‌గా నటి ప్రగతి చాలా మంది ప్రేక్షకులకి దగ్గరైంది. కొన్ని సంవత్సరాల నుండి తన నటనతో అలరిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్‌లో సందడి చేస్తుంది. తాజాగా ప్రగతి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది.
ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్‌కి నెటిజన్స్ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రగతి ఎనర్జీ మరో లెవల్ అంటూ కొందరు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.ఆమె డిస్కో డాన్సర్ మాదిరి ఫాస్ట్ బీట్ కి స్టెప్స్ వేస్తారు. ప్రభుదేవా కూడా ఈమె డాన్స్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే. తరచుగా ట్రెండీ సాంగ్స్ కి ప్రగతి ఓ డాన్స్ వీడియో చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. మరోవైపు ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం ఎత్తింది. జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే.
Pragati Dance Going Crazy Video on instagram
ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు. ప్రగతి ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారోచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు…
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్‌లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…
Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
This website uses cookies.