Home » Entertainment » Prakash Raj Giving Lakhs Of Money To His First Wife
Entertainment

Prakash Raj : విడాకులు తీసుకున్నా కూడా మాజీ భార్య‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తున్న ప్ర‌కాశ్ రాజ్.. ఎందుకో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: February 17, 2022, 9:30 pm
Advertisement

Prakash Raj : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ పాత్ర‌లోనైన ప్ర‌కాశ్ రాజ్ ఇన్వాల్వ్ అయిపోతాడు.అయితే ప్ర‌కాశ్ రాజ్ గ‌తంలో తన మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చేసి 2010 ఆగష్టు‌లో పోనీ వర్మ అనే ఫేమస్ కొరియోగ్రాఫర్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరికి వేదాంత్ అనే కొడుకు ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ మొదటి భార్యతో ముగ్గురు పిల్లల్ని కన్నారు. వారిలో ఇద్దరు కూతుళ్లు కాగా.. ఒక కొడుకు. ఓ యాక్సిడెంట్‌లో ఐదేళ్ల కొడుకును కోల్పోయారు ప్రకాష్ రాజ్. అయితే ప్ర‌కాశ్ రాజ్‌కి ల‌లిత కుమారికి కొన్ని విష‌యాల‌లో ప‌డ‌క‌పోవ‌డం వ‌ల‌న విడాకులు తీసుకున్నారు.

Advertisement

ప్ర‌కాశ్ రాజ్ మంచి మ‌న‌స్సు…ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ.. నా మొదటి భార్యని నేను ఇప్పుడు నేను భర్తని కాకపోవచ్చు కానీ.. ఇప్పుడు మంచి ఫ్రెండ్‌ని. నా పిల్లలకు ఆమే తల్లి.. రేపటి రోజున నా పెద్ద కూతురు పెళ్లి అంటే.. నేను లతనే కూర్చోవాలి.. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. లోకం కోసం అబద్ధం చెప్పి బతకకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం.. అందరం కలిసే ఉన్నాం.. హ్యాపీగానే ఉన్నాం తను చెన్నైలో ఉంటుంది.. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా.. నా పిల్లలు అక్కడే అక్కడే ఉంటారు. నాకు ఒక కొడుకు పుట్టాడు.. వాడ్ని తమ్ముడూ అని నా కూతుళ్లు రాఖీ కట్టడానికి వస్తారు.. వాళ్లంతా హ్యాపీగానే ఉంటారు.


prakash raj giving lakhs of money to his first wife

Advertisement

లతకి ఈమె చీర పంపుతుంది.. ఈమెకు ఆమె చీర పంపుతుంది. ఇద్దరూ బాగానే ఉంటారు అంటూ ప్ర‌కాశ్ రాజ్ అని అన్నారు.అయితే విడాకుల త‌ర్వాత కూడా ప్ర‌కాశ్ రాజ్ త‌న భార్య‌కు ప్ర‌తి నెల డబ్బులు పంపించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ నెలనెలా తన మొదటి భార్య విజయ్ కుమార్ కి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు డబ్బును పంపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలిసిన ఎంతో మంది నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విడాకుల త‌ర్వాత ఫ్యామిలీని అలా వ‌దిలేయ‌కుండా ప‌ట్టించుకున్న ప్ర‌కాశ్ రాజ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్స్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి