prakash raj got married again pics viral
Prakash raj: విలక్షణ నటుడు ఫ్రకాశ్ రాజ్ కొన్ని సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరూ ఊహించలేరు. ఈ మధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాడు. బద్రి లో నందాగా నటించిన ప్రకాశ్ రాజ్ మళ్ళీ ఇంత కాలానికి వకీల్ సాబ్‌లో అదే పాత్రలో తన విలక్షణ నటనని చూపించాడు.
prakash raj got married again pics viral
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – ప్రకాశ్ రాజ్ కోర్ట్ సన్నివేశాలలో పోటీ పడి నటించారు. ఇలాంటి నటుడిని ఎన్ని విభిన్నమైన పాత్రల్లో అయినా ఎంతకాలమైనా చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులని నిరూపించాడు. అంతకముందులా ఆయన దూకుడుగా సినిమాలు చేయడం లేదు.కానీ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవిస్తున్నాడు. కాగా ఈ మధ్య మా ఎన్నికల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఆసక్తికరమైన చర్చలకి తెరలేపాడు.
prakash raj got married again pics viral
ఆయనకి మా అధ్యక్షుడిగా పట్టం కడితే ఇన్నేళ్ళుగా చేయని, జరగని కొత్త ప్రణాళికలతో మా ని సరికొత్తగా నడిపిస్తానని అందుకు నా దగ్గర పక్కా ప్లాన్ ఉందని హామీ ఇచ్చాడు. మాలో జరిగిన కొన్ని అవకతవకలను సరి చేసేస్తానంటూ వ్యాఖ్యలు చేసి అవతలి వారికి కౌంటర్ ఇచ్చాడు. ఇక మా బరిలో దిగేందుకు ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు గట్టిగా ఉంది. మా ఎలక్షన్స్ నిర్వహించినా, నిర్వహించకపోయినా ప్రకాశ్ రాజ్‌నే కుర్చీలో కూర్చోబెడతారని టాక్ వినిపిస్తోంది.
prakash raj got married again pics viral
ఇదిలా ఉంటే ఆయన తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ప్రకాశ్‌రాజ్, పోని వర్మను పెళ్లి చేసుకుని 11 సంవత్సరాలు పూర్తకావడంతో.. పెళ్ళిరోజు వేడుకల జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్.. ‘మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం.. మా పెళ్లికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు…
prakash raj got married again pics viral
కుటుంబంతో కలిపి జరుపుకున్న వేడుక ఇది’ అంటూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్న ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదే సందర్భంగా ప్రకాశ్ రాజ్ తన భార్యకి ఓ మూతి ముద్దు ఇచ్చాడు. ఆ పిక్ ని కూడా షేర్ చేయడంతో నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రకాశ్ రాజ్ ముద్దు పెట్టుకుంది భార్యనే కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండటం ఆసక్తికరం.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.