Prakash raj : పూరి ఆఫీస్ నుంచే ప్రకాశ్ రాజ్ ‘మా’ మీటింగ్స్ అన్నీ ఈ టాప్ సీక్రెట్ ఎవరికీ తెలియదు

Authored By vamana sai | The Telugu News | Published on: July 5, 2021, 12:40 pm

Prakash raj : గత కొన్ని రోజులుగా మా ఎలక్షన్స్ విషయంలో ఏం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాము. మా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తిప్పికొడితే 1000 ఓట్లు ఉండవు గానీ…రచ్చ, హడావిడి మాత్రం నేషనల్ లెవల్‌లో చేస్తుంటారు. ఈసారి అది మరీ ఎక్కువైంది. ప్రకాశ్ రాజ్ పోటీలో నిలుచుంటున్నాడు అనగానే అంతటా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈయనకి ఆపోజిట్‌గా మంచువారబ్బాయి మంచు విష్ణు పోటీ అంటే ఇక చూడాలి. డిస్కర్షన్స్ తారా స్థాయిలో జరిగాయి. ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండ గట్టిగా ఉంది. మంచు విష్ణుకి ఆయన తండ్రితో పాటు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.

prakash-raj maa meetings are from puri office

prakash-raj maa meetings are from puri office

అయితే ఇప్పటివరకు ఒక్క ప్రకాశ్ రాజ్ ప్యానల్ మెంబర్స్‌ను మాత్రమే ప్రకటించారు. మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్‌ను ప్రకటించలేదు. వీరికి పోటీగా జీవిత, సివిఎల్ నరసింహారావు, హేమ బరిలో ఉన్నారు. అయితే ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉంది. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ఉంటే హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. మూడు నాలుగురోజులు వాడి వేడిగా చర్చలు జరిగిన తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. మెగా వ్యూహంతో మెగాస్టార్ నిర్ణయంతో ఏకగ్రీవంగా ప్రకాశ్ రాజ్‌నే ఎన్నుకుంటారని అందరూ భావిస్తున్నారు. మరి అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో అన్నది ఇప్పుడే చెప్పలేము.

Prakash raj : పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచే అని తెలుస్తోంది.

కాగా ప్రకాశ్ రాజ్ ఇప్పటి వరకు..ఇకపై కూడా పెట్టబోయే ప్రెస్‌మీట్స్ అన్నీ కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచే అని తెలుస్తోంది. ఇటీవల ప్రకాశ్ రాజ్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా పూరి జగన్నాథ్ ఆఫీసు నుంచే అంటున్నారు. అయితే ప్రెస్ మీట్ పూరి ఆఫీసులో జరగలేదు. కేవలం చర్చలు మాత్రమే అక్కడ జరుపుతున్నారట. మా కి సంబంధించిన ఏ విషయమైన చర్చించుకోవడానికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని పూరి జగన్నాథ్ ఆఫీసులోనే జరుగుతున్నట్టు సమాచారం. ఈ రకంగా కూడా ప్రకాశ్ రాజ్ గెలుస్తాడని ఆయన్నే ఎన్నుకుంటారని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp