pranitha gives baby girl
Pranitha : హీరోయిన్ ప్రణీత కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. కన్నడ భాషలో పోకిరి చిత్రం రీమేక్ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించారు. హిందీలో ప్రవేశించి అజయ్ దేవగన్‌తో కలిసి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాన్ కిత్తన్ సినిమాలో నటిస్తున్నది. అయితే తాజాగా ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది.
ప్రణీత షేర్ చేసిన పిక్‌లో తన బిడ్డను చూసుకుంటూ ఎంతో మురిసిపొతూ కనిపించిందామె. పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకుంటూ ఉన్న ప్రణీత కళ్లలో మాతృత్వ ప్రేమ కనిపిస్తోంది. ”పాప పుట్టినప్పట్నుంచి అంతా కలలా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం నిజంగా నా అదృష్టం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ ఎమోషనల్ సందేశాన్ని పోస్ట్ చేసింది ప్రణీత. ఆమెకు అభిమానులతో పాటు సెలబ్స్ కూడా విషెస్ తెలియజేస్తున్నారు. హాలక్ష్మి ఇంటికొచ్చిందంటూ ప్రశంసిస్తున్నారు.
pranitha gives baby girl
ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్ కాపీని షేర్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. వరుసగా బేబీ బంప్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లి కాబోతున్నామనే ఆనంద క్షణాలను పంచుకుంటూ తెగ మురిసిపోయింది ప్రణీత. అలాగే సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఏకంగా పండంటి కూతురికి జన్మనివ్వడం విశేషం.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.