Pranitha : పండంటి పాపాయికి జ‌న్మనిచ్చిన ప్ర‌ణీత సుభాష్‌

Authored By Sam C | The Telugu News | Published on: June 11, 2022, 1:30 pm

Pranitha : హీరోయిన్ ప్ర‌ణీత క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. క‌న్నడ భాషలో పోకిరి చిత్రం రీమేక్ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించారు. హిందీలో ప్రవేశించి అజయ్ దేవగన్‌తో కలిసి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాన్ కిత్తన్ సినిమాలో నటిస్తున్నది. అయితే తాజాగా ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది.

ప్రణీత షేర్ చేసిన పిక్‌లో తన బిడ్డను చూసుకుంటూ ఎంతో మురిసిపొతూ కనిపించిందామె. పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకుంటూ ఉన్న ప్రణీత కళ్లలో మాతృత్వ ప్రేమ కనిపిస్తోంది. ”పాప పుట్టినప్పట్నుంచి అంతా కలలా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం నిజంగా నా అదృష్టం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ ఎమోషనల్ సందేశాన్ని పోస్ట్ చేసింది ప్రణీత. ఆమెకు అభిమానుల‌తో పాటు సెల‌బ్స్ కూడా విషెస్ తెలియ‌జేస్తున్నారు. హాలక్ష్మి ఇంటికొచ్చిందంటూ ప్రశంసిస్తున్నారు.

pranitha gives baby girl

pranitha gives baby girl

Pranitha : మాతృత్వపు అనుభూతి..

ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ తర్వాత సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్‌ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్‌ కాపీని షేర్‌ చేసి గుడ్‌ న్యూస్‌ షేర్‌ చేసుకుంది. వరుసగా బేబీ బంప్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లి కాబోతున్నామనే ఆనంద క్షణాలను పంచుకుంటూ తెగ మురిసిపోయింది ప్రణీత. అలాగే సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఏకంగా పండంటి కూతురికి జన్మనివ్వడం విశేషం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp