Salaar Update : ప్రభాస్ సలార్ కి సేమ్ బ్యాక్ డ్రాప్ ని వాడబోతున్న ప్రశాంత్ నీల్ ..?

Authored By vamana sai | The Telugu News | Published on: January 20, 2021, 3:30 pm

Prabhas Salaar Update ప్రభాస్ కెరీర్ లో యాక్షన్ సినిమాలంటే అందరికీ ముందు గుర్తొచ్చేది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంఛైజీ. యాక్షన్ సీక్వెన్స్ ఛత్రపతిలో ఒక రకంగా.. బాహుబలి సినిమాలో ఒకరకంగా తెరకెక్కించాడు రాజమౌళి. ముఖ్యంగా బాహుబలి రెండు భాగాలలో కూడా కాలకేయ తో తెరకెక్కిన వార్ ఎపిసోడ్ .. అలాగే రెండవ భాగంలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాల రేంజ్ ని తలపిస్తాయి. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సాధించిన ప్రభాస్ సాహో అన్న సినిమా చేశాడు.

prashanth neel is going to you use same back drop for prabhas Salaar

prashanth neel is going to you use same back drop for prabhas Salaar

హాలీవుడ్ రేంజ్ సినిమాగా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాహో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే దేశం మొత్తం భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో రాధే శ్యాం అన్న పీరియాడికల్ సినిమా తో పాటు సలార్.. ఆదిపురుష్..వైజయంతీ మూవిస్ నిర్మించే నాగ్ అశ్విన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలలో రాధే శ్యాం పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమా నుంచి భారీ యాక్షన్ సీన్స్ ని ఆశించే అవకాశాలు లేవు.

బ్యాక్ డ్రాప్ లోనే సలార్

ఈ విషయం మేకర్స్ కూడా హింట్ ఇచ్చారు. ఇక మిగతా మూడు సినిమాలలో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది సలార్. ఈ సినిమాలో ప్రభాస్ వైల్డ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడని అంటున్నారు. అయితే కేజీఎఫ్ 1 అండ్ 2 సినిమాలని తెరకెక్కించిన బ్యాక్ డ్రాప్ లోనే సలార్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అందుకే పోస్టర్ ని కూడా బ్లాక్ షేడ్ లో డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. అయితే కేజీఎఫ్ పార్ట్స్ లాగానే సేమ్ బ్యాక్ డ్రాప్ లో సలార్ ని తెరకెక్కిస్తే వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఉన్న సందేహం అంటున్నారు.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp