#image_titlePrashanth neel : సలార్ కథ సూర్య కోసమే.. కానీ ప్రభాస్ తో చేశాను .. ప్రశాంత్ నీల్..!!
Prashanth neel : తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఏకైక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. ఇక తెలుగులో రజనీకాంత్ కి ఎంత గుర్తింపు ఉందో సూర్యకి కూడా అంతే గుర్తింపు ఉంది. సూర్య అంటే తమిళ హీరో కాదు తెలుగు హీరో అనేలా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు ఆడియన్స్ కూడా సూర్యను బాగా ఆదరిస్తారు. ఇక సూర్య , ప్రభాస్ మంచి స్నేహితులు. బాహుబలి సమయంలో కూడా రాజమౌళి సూర్యని రిక్వెస్ట్ చేశారు. బాహుబలిలో ఒక్క సన్నివేశంలో అయినా కనిపించాలని కోరారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి సూర్య పై ఇలా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభాస్ సినిమా సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకెళుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ , సూర్య గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది
సలార్ సినిమాని ముందుగా ప్రశాంత నీల్ సూర్యతో చేయాలని అనుకున్నారట. ఉగ్రం, కేజిఎఫ్ సిరీస్ తర్వాత సలార్ కథ రాస్తున్నప్పుడు సూర్య నే ఊహించుకొని ప్రశాంత నీల్ కథ రాసుకున్నారట. ఆ స్టోరీ ప్లాన్, ఖాన్సార్ రాజ్యాన్ని మోయాలంటే హీరో కూడా అదే కట్ అవుట్ తో ఉండాలని ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి ప్రభాస్ సూట్ అవుతారని చెప్పారట. సూర్య కంటే ప్రభాస్ ఈ సినిమాకి బాగా సెట్ అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారంట. ప్రశాంత నీల్ ఆలోచనలో పడ్డారట. ఇంత పెద్ద స్టోరీ మోయాలంటే హీరో కూడా అదే కటౌట్ లో ఉండాలని, సూర్యకి స్టార్ డం ఉన్నప్పటికి, ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉండడంతో ప్రశాంత్ ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నారట. సలార్ స్టోరీ కూడా ప్రభాస్ కి బాగా కనెక్ట్ అవుతుందని ప్రశాంత్ భావించారట.
వెంటనే ప్రశాంత్ ప్రభాస్ ని కలిసి స్టోరీ చెప్పారట. కథ నచ్చడంతో ప్రభాస్ కూడా ఒకే చెప్పడంతో సినిమా ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళుతోంది. ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా అని అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సూర్య ఫ్యాన్స్ సలార్ సినిమాకి సూర్య అయితే ఎలా ఉంటారు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సూర్య కాదు సలార్ సినిమాకి ప్రభాస్ నే కరెక్ట్ గా సూట్ అవుతారు అని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. సూర్య, ప్రభాస్ కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం కానీ సలార్ కి ప్రభాస్ నే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. ఇక పృధ్విరాజ్ సుకుమారన్ పాత్రలో గోపీచంద్ అయితే బాగుండేది అని ప్రభాస్, గోపీచంద్ బయట ఎలాగో స్నేహితులు కాబట్టి సినిమాలో కూడా వాళ్ళిద్దరూ పెడితే బాగుండేది అని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, గోపీచంద్ ఫ్రెండ్షిప్ తెరమీద బాగా పండేదని సోషల్ మీడియాలో వివిధ రకాలుగా చర్చ జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.