
kcr bought 22 land cruiser cars before telangana elections
KCR : తెలంగాణలో మూడో సారి అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెప్పిన బీఆర్ఎస్ పార్టీ చివరకు చతికిలపడింది. 39 సీట్లకే సరిపెట్టుకుంది. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీని మాత్రం కాంగ్రెస్ చాలా ఏళ్ల పాటు పాలించినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. తెలంగాణ ఉద్యమంతో ఫేమస్ అయి.. ఆ తర్వాత తెలంగాణ కలను సాకారం చేసి అదే పార్టీని రాజకీయ పార్టీగా మార్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు కేసీఆర్. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణలో చరిత్ర సృష్టించాలని అనుకున్నారు కానీ.. ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 రోజులకు కేసీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా అభయ హస్తం స్కీమ్ లాంచ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతానని అనుకొని.. మూడోసారి అధికారంలోకి వస్తామని ముందే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేసీఆర్ కొనుగోలు చేశారట. ఆ కార్లకు ఒక్కో కారు ధర మూడున్నర కోట్లు ఉంటుందట. అంటే.. సుమారు 80 కోట్లు ఖర్చు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కేసీఆర్ కొన్నారట. బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఎన్నికలకు ముందే.. అంటే ఎన్నికల కోడ్ రాకముందే 22 కార్లను కొని విజయవాడలో కేసీఆర్ దాచిపెట్టారట. కేసీఆర్ సృష్టించిన సంపద ఏదైనా ఉందంటే అది ఇదే.. ముఖ్యమంత్రిగా ఈ విషయం తెలుసుకోవడానికి నాకే 10 రోజుల సమయం పట్టిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను పాత బండ్లను అడ్జస్ట్ చేయమని నేను చెప్పాను. ఓ అధికారి వచ్చి ఈ విషయం చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వాహనాలను తీసుకురావాలని ప్లాన్ చేశారట. 22 కార్లు అంటే మామూలు విషయమా? ప్రభుత్వ ఆస్తి అది.. ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకుంటాం అని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.