Samantha : స‌మంత‌ నాగ చైత‌న్య విడాకుల‌పై ప్రీతమ్ జుకల్కర్ పోస్టు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2021,12:40 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా విడిపోవడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుందని, పిల్లలు వద్దన్నదని వార్తలు రాగా, వాటన్నిటినీ సమంత ఖండించింది. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేశాడు.స్టైలిస్ట్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ వల్లే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి

preetam jukalkar instagram post on samantha naga chaitanya

preetam jukalkar instagram post on samantha naga chaitanya

. కాగా, తాను సమంతను అక్కా అని పిలుస్తానని, తమ రిలేషన్ షిప్ ఏంటో నాగచైతన్యకు తెలుసని డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ వివరణ ఇచ్చాడు కూడా. అయితే, తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరిస్‌లో షేర్ చేసిన స్టోరిస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాటి గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఇంతకీ ప్రీతమ్ జుకల్కర్ ఏమని పోస్టులు పెట్టాడంటే.. ‘కంగ్రాట్స్ స్లట్.. హీ ఈజ్ యువర్స్’ అని ఇన్ స్టా స్టోరి షేర్ చేయగా, అది ఎవరిని ఉద్దేశించి చేసిందోననే చర్చ నడుస్తోంది.

Samantha : అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయంటున్న ప్రీతమ్ జుకల్కర్..

preetam jukalkar instagram post on samantha naga chaitanya

preetam jukalkar instagram post on samantha naga chaitanya

ఇంకో ఇన్ స్టా స్టోరి‌లో ప్రీతమ్ జుకల్కర్ … ‘అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. ఎంత దాచిపెట్టినప్పటికీ ఏదో ఒక రోజు అవి బయటపడుతాయి’ అని ఇన్ స్టా స్టోరిలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రీతమ్ జుకల్కర్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టులు పెట్టాడనే చర్చ నడుస్తున్నది. కొందరు ఈ పోస్టులు నాగచైత్యను ఉద్దేశించి చేసినవని అంచనా వేస్తున్నారు. నాగచైతన్య సమంతకు తెలియకుండా ఇంకో అమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని, అందుకే సమంతకు విడాకులు ఇచ్చాడని అదే.. ఈ ఇన్ స్టా గ్రామ్ స్టోరిల సారమని అంటున్నారు.

అయితే, ఈ స్టోరిలు పోస్టు చేసిన రెండు గంటల తర్వాత ప్రీతమ్ జుకల్కర్ వాటిని డిలీట్ చేయడం గమనార్హం. కాని అలా డిలీట్ చేయడం ద్వారా వీటి గురించి సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ చర్చ జరుగుతున్నది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి