Preetham Jukalker On Relation WIth Samantha
Samantha : సమంత Samantha నాగ చైతన్య విడాకులు నెట్టింట్లో ఎంతటి చర్చుకు దారి తీశాయో అందరికీ తెలిసిందే. చైసామ్ విడాకుల వార్తలు సెప్టెంబర్‌లోనే మొదలయ్యాయి. ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారు అని, సమంత ముంబైకి షిఫ్ట్ కాబోతోందని, ఫ్యామిలీ కోర్టు మెట్లు కూడా ఎక్కేశారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని గత నెలలోనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని మాత్రం అందరూ రూమర్లేనని కొట్టిపారేశారు. కానీ తీరా అక్టోబర్ 2న అవే నిజమయ్యాయి.
Preetham Jukalker On Relation WIth Samantha
తామిద్దరం విడిపోతోన్నామని, ఇకపై భార్యాభర్తలుగా ఉండబోవడం లేదని సమంత, నాగ చైతన్య ఉమ్మడి ప్రకటన చేశారు. అక్కడితో కథ కొత్త మలుపులు తిరిగింది. అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు.. ఏం జరిగింది అనే కోణంలో మీడియా, సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. సమంత, తన డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ మధ్య రిలేషన్ ఉందని, అందుకే చైతూ విడాకులు ఇచ్చేశాడని కొందరు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.
Who is pritam jukalkar He said I love u to samantha
సమంత తన అఫైర్ల గురించి వచ్చిన వార్తలను ఖండించింది. సమంత ఫ్రెండ్ సాధన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమంతను ప్రీతమ్ అక్కా అని పిలుస్తాడంటూ సాధన చెప్పింది. తాజాగా ప్రీతమ్ స్పందించాడు. ఓ మీడియాతో మన మనసులోని బాధను చెప్పాడు. సమంతను నేను అక్కా అని పిలుస్తాను.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో చైతన్యకు తెలుసు అంటూ ప్రీతమ్ జుకాల్కర్ అసలు సంగతి చెప్పేశాడు. దీంతో ఇప్పటికైనా ఆ రూమర్లకు తెరపడుతుందో లేదో చూడాలి.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.