Mahesh Babu COVID Positive : ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా…ట్విట్టర్ వేదికగా వెల్లడి..!
Mahesh Babu COVID Positive : టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
గత వారం రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఎన్ని ముందస్తూ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు.

prince mahesh babu tested COVID positive
త్వరలోనే ఆరోగ్యం బాగు చేసుకొని మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమ అభిమాన నటుడు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022