
Bigg Boss Telugu 8 : కోడలిగా విష్ణు ప్రియని అంగీకరించినట్టేనా.. పృథ్వీ తల్లి మాటలకి అవాక్కయిన కంటెస్టెంట్స్
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్8లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు ఒక్కొక్కరిగా హౌజ్‌లోకి వచ్చి సందడి చేస్తున్నారు.పదకొండో వారంలో భాగంగా కాస్త ఎమోషనల్‌గా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే హౌజ్‌లోకి రోహిణి, అవినాష్, యష్మి, నిఖిల్, నబీల్ పేరెంట్స్ వచ్చి సందడి చేశారు. ఆయా కంటెస్టెంట్లని సంతోషపరిచారు. ఇక గురువారం ఎపిసోడ్‌లో మరో ముగ్గురు వచ్చారు. విష్ణు ప్రియా తండ్రి, పృథ్వీరాజ్ తల్లి, గౌతమ్ అన్న వచ్చారు. ప్రేరణ బాయ్ ఫ్రెండ్ అనుకోకుండా రాలేకపోతున్నట్టు తెలిపారు. వీడియో పంపించాడు. ఇక హౌజ్‌లోకి వచ్చిన విష్ణు ప్రియా తండ్రి ఆమెతో చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాడు. చాలా విషయాలు చెప్పాడు రిలేషన్ ముఖ్యం కాదని, అది ఇక్కడికే పరిమితమని, కానీ సొంత ఆట ముఖ్యమని, ఈ రిలేషన్స్ కంటిన్యూ కావు అని అన్నారు.
పృథ్వీరాజ్‌తో విష్ణు ప్రియా క్లోజ్‌గా మూవ్ అవుతుండడం విషయంలో ఇన్‌డైరెక్ట్‌గా కొన్ని కామెంట్స్ చేశారు. విష్ణు ప్రియాని చిన్నప్పుడు పట్టించుకోలేదని, తను పుట్టినప్పుడు దగ్గర లేను అని, చూసేందుకు కూడా రాలేకపోయానని, కొన్ని పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని, అందుకు సారీ చెప్పాడు. విష్ణు ప్రియా ఎవరి సపోర్ట్ లేకుండా తనే స్వతహాగా ఎదిగిందని, తన ప్రోత్సాహం ఏం లేదని, తాను డబ్బులు కూడా ఇవ్వలేకపోయానని చెప్పాడు. ఓ రకంగా ఆవేదన వ్యక్తం చేశాడు. నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తా అని, అతను ఎక్కడ ఉన్నాడో తెలియదన్నాడు. అయితే ఇక్కడే ఉన్నాడని కంటెస్టెంట్లు చెప్పగా, ఇవన్నీ ఉత్తిత్తి వ్యవహారాలు అని తేల్చేశాడు.
Bigg Boss Telugu 8 : కోడలిగా విష్ణు ప్రియని అంగీకరించినట్టేనా.. పృథ్వీ తల్లి మాటలకి అవాక్కయిన కంటెస్టెంట్స్
అనంతరం పృథ్వీరాజ్ తల్లి రాగా, ఆమె చాలా ఓపెన్‌గా కామెంట్లు చేసింది. బాగా ఆట ఆడుతున్నావని, సేవ్ అయిన ప్రతిసారి ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పడం లేదని, కచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలని తెలిపింది. విష్ణు ప్రియా గురించి చెబుతూ, అమ్మాయి బాగుందని, బాగా ఆడుతుందని తెలిపింది. ఆమె తనకు బాగా నచ్చిందని తెలిపింది. మంగుళూరు తీసుకురానా? అని పృథ్వీ అడగ్గా తీసుకురా అని చెప్పడంతో, కోడలిగా యాక్సెప్ట్ చేస్తున్నట్టేనని అంరు అంటున్నారు.. ఇక చివరగా గౌతమ్ బ్రదర్ వచ్చాడు. బాగా ఆడుతున్నావని, ఆట పుంజుకుందని, అదే కాన్ఫిడెన్స్ తో ఆడాలని తెలిపింది. ఇక లవ్ స్టోరీల జోలికి వెళ్లొద్దని తెలిపారు. ట్రయాంగిల్, రెక్టాంగిల్ అంటూ వద్దు. ఆ ట్రాప్‌లో పడకు అని, కేవలం నీకు నువ్వు ఆడు, లవ్ వైపు వెళ్లొద్దని తేల్చేశాడు. కప్ గెలవాలని తెలిపారు. మరోవైపు తన ఫ్యామిలీ రాలేదని టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ ఫ్యామిలీని పంపించాలని వేడుకున్నాడు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.