Priyamani : పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ వారు నరకం చూపిస్తున్నారు.. ప్రియమణి సంచలన కామెంట్స్
Priyamani : ఈ మధ్య సెలబ్రిటీలకి చాలా ఇబ్బందులు ఎదురవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా నెటిజన్స్ తో ముచ్చటిస్తున్న నేపథ్యంలో వారు చేసే వికృతి చేష్టలు వీరిని మరింత ఇబ్బంది పెడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలకు మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పడంలో సందేహం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు.. అయితే ఈ రెండింటిని ముడి పెడుతూ సెలబ్రిటీలను కొంతమంది ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చిన ప్రియమణి వాసుదేవ్ ఆనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
కేరళకు చెందిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనేబాగా ఫేమస్ అయింది. 2003 సంవత్సరం నుంచి… తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ రాణిస్తోంది. 2003 సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో… అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంది ప్రియమణి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలలో కూడా ఛాన్సులు కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగలో… ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రియమణి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, గోలీమార్ లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది.
Priyamani : పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ వారు నరకం చూపిస్తున్నారు.. ప్రియమణి సంచలన కామెంట్స్
తాజాగా ప్రియమణి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.ముస్తఫా రాజ్ నాకు ఎంతో కాలం నుండి తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడం వల్లే పెద్దలను ఒప్పించి మేము వివాహం చేసుకున్నాము. అయితే 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పుడు చాలా మంది మాపై విమర్శలు గుప్పించారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని ట్రోల్ చేశారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ళ మాటల వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాను.. కుల మతాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న స్టార్లు చాలామంది ఉన్నారు కదా.. అయితే ఈ విషయంలో నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అయింది ప్రియమణి. ప్రేమకి మతం, కులం వంటివి అడ్డు కాదు ప్రియమణి చెబుతూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…
Heavy Rain in Kamareddy : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను…
Chandrababu - Family Card : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ కార్డు' జారీ…
Ganesh Navaratri : వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. వీధులు, మండపాలు రంగుల అలంకరణలతో, విద్యుత్…
Hyderabad Beach : హైదరాబాద్కు త్వరలోనే ఒక వినూత్నమైన ఆకర్షణ రాబోతుంది. నగర శివారులోని కొత్వాలగూడలో రూ. 225 కోట్ల…
Best Phones | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గేమింగ్కు ఉపయోగపడే ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్,…
Jio and Airtel | తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతున్న తరుణంలో, సంబంధిత ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్…
Nivetha Pethuraj | టాలీవుడ్లో తన సొగసైన నటనతో మంచి గుర్తింపు సంపాదించిన నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు…
This website uses cookies.