Home » Entertainment » Priyamani Mass Dialogue In Dhee 13 Grand Finale
Entertainment

Priyamani : ఇక్కడ పగిలిందిరా!.. ప్రియమణి మరీ నాటుగా ఉందే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 29, 2021, 8:40 pm
Advertisement

Priyamani : ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తునే.. మరోవైపు రియాలిటీ షోలలో జడ్జ్‌గా చేస్తున్నారు ప్రియమణి. ఢీ షోకు ప్రియమణి ఒక రకమైన అట్రాక్షన్ అనే చెప్పాలి. అందంతోనే కాకుండా అద్భుతమైన జడ్జ్‌మెంట్‌తో కూడా ఆకట్టుకుంటుంది ప్రియమణి. కంటెస్టెంట్‌లకు తప్పోప్పులను చెప్పడమే కాకుండా.. మంచి సలహాలు కూడా ఇస్తుంటుంది. అయితే చాలా వరకు ప్రియమణి.. ప్రదీప్, సుధీర్, ఆది, రష్మీ, దీపికలతోపాటుగా కంటెస్టెంట్‌లతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది.

Advertisement

అయితే తాజాగా ఢీ 13 గ్రాండ్ ఫినాలే‌లో ప్రియమణి ఇచ్చిన జడ్జ్‌మెంట్ చూస్తే.. మరి ఇంత నాటుగా ఉందే అని అనిపిస్తుంది. ఫినాలే షోలో..కంటెస్టెంట్ కార్తీక్ వయలెన్స్ ఈజ్ ఫ్యాషన్ అనే పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత.. ‘నీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడుగురా’ అని కార్తీక్ డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత ప్రియమణి.. ఇక్కడ పగిలిందిరా అంటూ కామెంట్ చేస్తుంది.

Priyamani mass dialogue in dhee 13 grand finale

Advertisement

Priyamani : ఢీ షోలో ప్రియమణి రచ్చ..

అయితే ఇది చూసిన నెటిజన్స్.. అంతా సాఫ్ట్‌గా ఉండే ప్రియమని..మరి ఇంత నాటుగా డైలాగ్‌ చెప్పడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఏపిసోడ్.. డిసెంబర్ 1వ తేదీన ప్రసారం కానుంది. ఇక, ఢీ 13 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వస్తున్నారు. షో విన్నర్‌కు, వాళ్ల మాస్టర్‌కు కలిపి 75 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అయితే గ్రాండ్ ఫినాలేలో కావ్య గెలిచినట్టుగా వార్తలు వస్తున్నాయి

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి