Jr NTR : ఏపీలో రాజకీయాలు ఒక్కోసారి ఒక్కోలా మలుపు తిరుగుతుంటాయి. మొన్నటివరకు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగిన వార్ ఇప్పుడు టీడీపీ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్టుగా సాగుతోంది. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు ఫ్యామిలీని దూషించారని బాబు వెక్కివెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మేనత్త నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, మొదట ఈ కామెంట్స్ చేసింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అతను టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి.. ఈ సాకు చూపి వైసీపీ పార్టీ తప్పించుకుంది.
నారా భువనేశ్వరి పై చేసిన కామెంట్స్‌కు చంద్రబాబు బాధపడటంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది ఆ రోజు.. మరుసటి రోజున నందమూరి ఫ్యామిలీ నారా భువనేశ్వరికి మద్దతు నిలిచారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధరేశ్వరి ఇలా అందరూ ఏకతాటిపైకి వచ్చి వైసీపీ నాయకులను తూర్పార బట్టారు. మరోసారి రిపీట్ అయితే మేమేంటో చూపిస్తామని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏన్టీఆర్ విడుదల చేసిన వీడియోపై టీడీపీ సీనియర్ లీడర్లు వర్ల రామయ్య, బుద్ధ వెంకన్న మాట్లాడుతూ.. మీ అత్తను తిడితే ఇలాగేనా స్పందించేది అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై యంగ్ టైగర్ ఫ్యాన్ భగ్గుమంటున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ, టీడీపీ లీడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ రాజకీయ రొచ్చులోకి మా నాయకుడికి లాగితే బాగుండదని హెచ్చరించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా ఎస్‌ఆర్ఎం థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయొద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రచారం చేసినట్టు కూడా తెలిసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.