Home » Entertainment » Priyamani Strong Reply To Netigen
Entertainment

Priyamani : ఆంటీ అని పిలిచిన నెటిజన్ కి దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన ప్రియమణి ..!

Authored By
aruna
The Telugu News | Published on: September 24, 2023, 12:00 pm
Advertisement

Priyamani : ఇప్పుడున్న సోషల్ మీడియా కారణంగా జనాలు ప్రతి ఒక్కదానిపై స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ పై ఎటువంటి కామెంట్స్ చేస్తారో అందరికీ తెలుసు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు సోషల్ మీడియాలో హీరోయిన్లపై కామెంట్లు పెడుతుంటారు. వీటికి కొంతమంది హీరోయిన్లు గట్టిగా స్పందిస్తూ కౌంటర్లు ఇస్తారు. మరికొందరు సైలెంట్ గా ఉండిపోతారు. ఇక బుల్లితెర యాంకర్ అనసూయపై ఎన్నోసార్లు ట్రోలింగ్ జరిగింది. ఆ మధ్య చాలామంది అనసూయ ఆంటీ అంటూ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.

Advertisement

ఈ కామెంట్స్ కి అనసూయ చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. చివరకు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా అనసూయని వదలలేదు. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన ప్రియమణిని కూడా కొందరు నెటిజన్లు తనను ఆంటీ అని కామెంట్ చేశారు. తాజాగా ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ బ్లాక్ ఆంటీ అని నెగటివ్ కామెంట్ పెట్టాడు. దీంతో ప్రియమణికి కోపం వచ్చి ఇప్పుడు నా వయసు 38 ఏళ్ళు.. అయినా నేను హాట్ గానే ఉన్నాను అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. అలాగే పాజిటివ్గా కూడా కామెంట్ చేసింది.

Priyamani strong reply to Netigen

Advertisement

నన్ను ఆంటీ అని కామెంట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు. వయసు పెరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వయసు పెరగటం అనేది మామూలుగా జరిగే ప్రక్రియ అంటూ వెల్లడించింది. దీంతో ప్రియమణి చేసిన కామెంట్లకు చాలామంది నెటిజన్స్ పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు. అయితే మరి కొందరు అదే అనసూయ అయితే ఆంటీ అంటే ఏ రేంజ్ లో స్పందించేదో అంటూ ఆమెను మళ్లీ ఈ విషయంలోకి లాగారు. వారి వయసుకు తగ్గట్టు ఆంటీ అని పిలిచారు దాంట్లో తప్పు ఏముంది వయసు ఎంత దాచిపెట్టుకున్న దాగదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి