Priyamani : కిందా మీదా పడుతోంది.. ప్రియమణి ఆసనాలు వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 14 November 2021, 6:15 am

Priyamani : ప్రియమణి ప్రస్తుతం నేషనల్ స్టార్. ఓటీటీ కంటెంట్లకు కేరాఫ్ అడ్రస్. మరో వైపు వెండితెరపై ప్రయోగాత్మక పాత్రలకు ఓకే చెబుతోంది. ఇంకో వైపు బుల్లితెరపై అదే వెకిలి చేష్టలు, కుళ్లు కామెడీలకు కేరాఫ్ అడ్రస్ అయిన షోలకు, ఈవెంట్లలో సందడి చేస్తోంది. మొత్తానికి ప్రియమణి మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా రచ్చ చేస్తోంది. మొన్నటి వరకు విడాకుల వ్యవహారంతో సతమతమైంది

తన భర్త ముస్తపా రాజ్ మొదటి భార్య పెట్టిన కేసుతో నానా రచ్చ జరిగింది. ప్రియమణికి, ముస్తఫా రాజ్‌కు మధ్య దూరంపెరిగిందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఒకే ఒక్క ఫోటోతో తిప్పి కొట్టేసింది ప్రియమణి. దీపావళి నాడు ఈ ఇద్దరూ కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోలను ప్రియమణి షేర్ చేయడంతో రూమర్లకు పుల్ స్టాప్ పడింది.

Priyamani Yoga Session Video

Priyamani Yoga Session Video

Priyamani : ఆసనాలతో ప్రియమణి రచ్చ..

తాజాగా ప్రియమణి వర్కవుట్లకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా స్టోరీలోపెట్టేసింది. ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోయిన్లన్న తేడా లేకుండా అందరూ ఫిట్ నెస్ మీద బాగానే దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రియమణి చేసిన యోగాసనాలు వైరల్ అవుతున్నాయి. కిందా మీద పడుతోంది..అటూ ఇటూ వంగుతోంది.మొత్తానికి రబ్బర్‌లా సాగిపోయింది. ప్రియమణి యోగా విన్యాసాలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి