Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ ని గ్లామర్ క్వీన్ గా మార్చేస్తున్నారా ..?

Authored By vamana sai | The Telugu News | Published on: February 20, 2021, 6:00 am

Priyanka arul mohan : ప్రియాంక అరుల్ మోహన్ నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. డెబ్యూ సినిమాలో చాలా డీసెంట్ క్యారెక్టర్ తో ఆకట్టుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రేక్షకుల నుంచి అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే యంగ్ హీరో శర్వానంద్ కి జంటగా శ్రీకారం అన్న సినిమాలో నటించే అవకాశం అందుకుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

కాగా ఈ సినిమా మార్చ్ 11 న రిలీజ్ కాబోతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట నిర్మిస్తున్నారు. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ప్రియాంక అరుళ్ డీసెంట్ క్యారెక్టర్ చేస్తోంది. అంతేకాదు అల్ట్రా మోడ్రన్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతుందని కూడా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో పోటీ తట్టుకోవాలంటే గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వాల్సిందే. లేదంటే ఇప్పుడున్న హీరోయిన్స్ కి పోటీగా నిలబడి అవకాశాలు అందుకోవడం.. సక్సస్ లు దక్కించుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. అందుకే ప్రియాంక ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సై అంటుందోంది.

priyanka arul mohan changed as a glamour queen

priyanka arul mohan changed as a glamour queen

Priyanka arul mohan : ప్రియాంక పర్‌ఫెక్ట్ జోడీ అని చెపుకుంటున్నారు.

ఈ విషయం తాజాగా రిలీజైన శ్రీకారం సినిమా సాంగ్ తో అర్థమవుతోంది. ఈ సాంగ్ యూత్ ని టార్గెట్ చేసి చిత్రీకరించారని క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు భలేగుంది బాలా అన్న సాంగ్ లో చక్కగా లంగా ఓణీ లో కనిపిస్తూనే నాభి అందాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా రిలీజైన హే అబ్బాయి అన్న సాంగ్ లో మోడ్రన్ లుక్ లో కూడా గ్లామర్ ట్రీట్ ఇచ్చి ఆకట్టుకుంది. మొత్తానికి ప్రియాంక అరుళ్ మోహన్ ని గ్లామర్ క్వీన్ గా మార్చేస్తున్నారు దర్శకులు. ఇక యంగ్ హీరోలకి ఇప్పుడు ప్రియాంక పర్‌ఫెక్ట్ జోడీ అని చెపుకుంటున్నారు. ఇప్పటికే పలు కొత్త ప్రాజెక్ట్స్ కి ప్రియాంక అరుళ్ పేరు పరిశీలిస్తున్నారట.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp