Priyanka Chopra : విడాకులకు సిద్దమైన ప్రియాంక చోప్రా.. అలా చేయడంతో అనుమానాలు
Priyanka Chopra : సమంత నాగ చైతన్య మధ్య ఏదో విబేధాలున్నాయని, ఇద్దరూ విడిపోతోన్నారనే వార్త బయటకు ఎప్పుడు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. సమంత తన పేరులోని అక్కినేని పదాన్ని సోషల్ మీడియా ఖాతాల్లోంచి తీసేసింది. అలా తన పేరును మార్చుకోవడంతో అసలు సంగతి మెల్లిగా బయటకు వచ్చింది. విడాకులు తీసుకుంటోంది అందుకే ఇలా అక్కినేని పేరును తీసేసిందని అంతా అన్నారు. చివరకు అదే నిజమైంది. అయితే ఇప్పుడు సమంతను ప్రియాంక చోప్రా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రియాంక చోప్రా Priyanka Chopra, నిక్ జోనస్ nick jonas వ్యవహారమే తేడా. నిక్ జోనస్ ప్రియాంక ముందు ఎంతో చిన్నవాడు. ఓ లెక్కన పిల్లాడు అన్నమాట. ఈ ఇద్దరి వ్యవహారం మీద అందరికీ అనుమానాలే ఉన్నాయి. ఇది వరకే ఎన్నో సార్లు విడాకుల రూమర్లు వచ్చాయి. అయితే ఈ సారి ఇంకొంచెం గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే ప్రియాంక కూడా తన పేరును మార్చుకుంది. ఇన్ని జోరులు ప్రియాంక జోనస్ చోప్రా అని ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ప్రియాంక చోప్రా అని మాత్రమే పెట్టుకుంది.

Priyanka Chopra Changed Her Name And Removed Jonas Name
Priyanka Chopra : విడాకులు తీసుకుంటోన్న ప్రియాంక..
దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. ప్రియాంక చోప్రా Priyanka Chopra, నిక్ జోనస్ nick jonas లు విడిపోతోన్నారని, అందుకే ఇలా పేరు మార్చుకుందని ప్రియాంక మీద రూమర్లు వస్తున్నాయి. అసలే ప్రియాంక, నిక్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వారి భాష ఒకటి కాదు.. వారి మతం ఒకటి కాదు.. ఆఖరికి వారి దేశం కూడా ఒకటి కాదు..ఇన్ని తారతమ్యాలున్నాయి. మరి ఈ ఇద్దరూ నిజంగానే విడిపోతోన్నారా? లేదా ఇవన్నీ వట్టి గాలి వార్తలేనా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.