Home » Entertainment » Producer Dil Raju Intrested To Young Heroin
Entertainment

Dil Raju : ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న దిల్ రాజ్… ఏకంగా ఇక్కడికే రప్పించుకున్నాడా …!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 2, 2022, 8:30 pm
Advertisement

Dil Raju : తెలుగు పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా చేసిన దిల్ రాజ్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అందుకు కారణం ఆయనకున్న తెలివితేటలు డెడికేషన్ అని అంటారు ఫాన్స్. సినిమా కథను బట్టి సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది. థియేటర్లో రిలీజ్ చేస్తే మంచిదా లేక ఓటీటీ లో రిలీజ్ చేస్తే బెటరా, ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది అని చెప్పగల సత్తా కేవలం స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ కే ఉంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో నిర్మించారు.

Advertisement

అంతేకాకుండా దిల్ రాజ్ సినిమా కథలను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు డిజాస్టర్ గా నీలుస్తాయని తెలిసి కూడా ప్రొడ్యూస్ చేశాడు. దానికి ముఖ్య కారణం ఆ కథ పట్ల ఆయన పెంచుకున్న ప్రేమ. అయితే రీసెంట్గా దిల్ రాజు యంగ్ హీరోయిన్ ఇవానాను తెలుగులో పరిచయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఇవానా పై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె నటనకు దిల్ రాజు ఫిదా అయ్యాడట. ఈ సినిమాను తెలుగులో నిర్మించింది దిల్ రాజునే. అయితే ఆ హీరోయిన్ ఇవానాను డైరెక్ట్ గా తెలుగు ద్వారా పరిచయం

producer Dil Raju intrested to young heroin

Advertisement

చేయడానికి దిల్ రాజు నానా తిప్పలు పడుతున్నాడట. దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆశిష్ రెడ్డితో రొమాంటిక్ థ్రిల్లర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఇవానాను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె తన తొలి సినిమాకే కోటి రూపాయల పారితోషికం తీసుకోబోతున్నట్లు ఆమె కాల్ షీట్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమాకే ఈ రేంజ్ లో పారితోషికం ఇచ్చి దిల్ రాజ్ ఆమెను బుక్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తొలి సినిమాకి అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఎందుకు ఇంతలా దిల్ రాజ్ ఆరాటపడుతున్నారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి