Pawan Kalyan : బుద్ది తక్కువ పని… పవన్‌ కళ్యాణ్ తో పెట్టుకోవడం తప్పయ్యింది

Authored By aruna | The Telugu News | Published on: September 24, 2022, 9:30 pm

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చిన దర్శక నిర్మాతలు అనుకుంటున్నా మాట బుద్ధి తక్కువ అయింది.. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని ఆశపడి కోట్లల్లో అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు నెత్తిన గుడ్డ అన్నట్లుగా పరిస్థితి మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క దర్శకుడు రెండు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, అయినా కూడా ఎప్పుడు ఆయన డేట్ లు ఇస్తాడా తెలియడం లేదు. ఒకవైపు జనసేనని బస్సు యాత్రకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్కొక్క నిర్మాత పదుల కోట్లలో అడ్వాన్స్ ను ఇచ్చి ఉన్నారు.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీరును వారు బాహాటంగా విమర్శించలేక పోతున్నారు. అలా అని కడుపులో దాచుకోలేక పోతున్నారు. సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ కి బుద్ధి తక్కువ అడ్వాన్స్ ఇచ్చి ఇరుక్కు పోయాము. ఇంకోసారి ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తో పెట్టుకోము అంటూ వారు సన్నిహితుల వద్ద రహస్యంగా చెబుతున్నారట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ముగ్గురు నలుగురు నిర్మాతలు మరియు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంది. నిర్మాతలు పదుల కోట్లలో అడ్వాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ లు ఇస్తే అప్పుడు సినిమాను మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నారు. దర్శకులు కూడా కథలు చెప్పి వాటికి స్క్రిప్ట్ రెడీ చేసి పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.

Producer Gave Advances To Pawan Kalyan Without Confirming His Dates

Producer Gave Advances To Pawan Kalyan Without Confirming His Dates

ఇలా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూడటం వల్ల దర్శక నిర్మాతల సమయం చాలా వృధా అవుతుంది.. ఒక దర్శకుడు లేదా నిర్మాత సంవత్సరంలో చాలా ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ వద్ద వారు ఇరుక్కు పోవడం వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం మాత్రమే కాకుండా వారు తీవ్రంగా ఆర్థిక పరమైన నష్టాలను చూడాల్సి వస్తుందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కాకుండా ఇంకా ముందు ముందు ఎవరు అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తీసుకున్న అడ్వాన్స్‌ లకు మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా సినిమా షూటింగ్ లు చేసిన కూడా పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp