kajal కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరం అవుతుందని అందరూ భావించారు. అందుకు కారణం చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఉదాహరణగా కనిపించడమే. కాజల్ అగర్వాల్ కూడా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 16 ఏళ్ళు అవుతోంది. 2004 లో బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2007 తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయింది. అదే సంవత్సరం చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా సెటిలయింది.
అయితే కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలుండగానే క్లోజ్ ఫ్రెడ్ అయిన గౌతం కిచ్లూ ని పెళ్ళి చేసుకుంది. దాంతో అందరూ ఇక కాజల్ అగర్వాల్ సినిమాలు కమిటవదేమో అని అనుకున్నారు. ముఖ్యంగా దర్శక, నిర్మాతలే కాజల్ అగర్వాల్ ని పక్కన పెట్టేస్తారన్న టాక్ వినిపించింది. కాని కాజల్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే పెళ్ళి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కాజల్ చేస్తున్న ఆచార్య, ముంబై సాగా, ఇండియన్ 2, మోసగాళ్ళు సినిమాలన్ని పెళ్ళికి ముందే కమిటయింది.
కాగా పెళ్ళి తర్వాత కాజల్ అగర్వాల్ ఫస్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ .. డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తున్నాడు. గతంలో కూడా ప్రభుదేవా – కాజల్ అగర్వాల్ జంట ప్రేక్షకులను అలరించారు. కాగా ఈ తాజా చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో కాజల్ అగర్వాల్ చిరంజీవి తో నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి ఫ్రీ అయిపోతుది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.