kajal కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత కూడా వెంటపడుతున్న నిర్మాతలు ..?

Authored By vamana sai | The Telugu News | Updated on: January 22, 2021, 1:45 pm

kajal కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరం అవుతుందని అందరూ భావించారు. అందుకు కారణం చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఉదాహరణగా కనిపించడమే. కాజల్ అగర్వాల్ కూడా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 16 ఏళ్ళు అవుతోంది. 2004 లో బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2007 తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయింది. అదే సంవత్సరం చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా సెటిలయింది.

అయితే కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలుండగానే క్లోజ్ ఫ్రెడ్ అయిన గౌతం కిచ్లూ ని పెళ్ళి చేసుకుంది. దాంతో అందరూ ఇక కాజల్ అగర్వాల్ సినిమాలు కమిటవదేమో అని అనుకున్నారు. ముఖ్యంగా దర్శక, నిర్మాతలే కాజల్ అగర్వాల్ ని పక్కన పెట్టేస్తారన్న టాక్ వినిపించింది. కాని కాజల్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే పెళ్ళి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కాజల్ చేస్తున్న ఆచార్య, ముంబై సాగా, ఇండియన్ 2, మోసగాళ్ళు సినిమాలన్ని పెళ్ళికి ముందే కమిటయింది.

పెళ్ళి తర్వాత ప్రభుదేవా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..!

కాగా పెళ్ళి తర్వాత కాజల్ అగర్వాల్ ఫస్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ .. డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తున్నాడు. గతంలో కూడా ప్రభుదేవా – కాజల్ అగర్వాల్ జంట ప్రేక్షకులను అలరించారు. కాగా ఈ తాజా చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో కాజల్ అగర్వాల్ చిరంజీవి తో నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి ఫ్రీ అయిపోతుది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp