Punarnavi Bhupalam : అందాల ఆరబోత… పునర్నవి పిక్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 1, 2021, 3:00 pm

Punarnavi Bhupalam : బిగ్ బాస్ చిన్నది పునర్నవి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాల్లో అలా అలా మెరిసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. మంచి నటిగా నిరూపించుకునే పాత్రలే వచ్చాయి. ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో పునర్నవి నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చాకే పునర్నవి అంటే ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో రాహుల్ పునర్నవి కాంబోలో బాగా క్లిక్ అయింది.

Punarnavi Bhupalam Bold Pic Goes viral

Punarnavi Bhupalam Bold Pic Goes viral

బయటకు వచ్చాక కూడా రాహుల్ పునర్నవి ట్రాక్ మీద బాగానే చర్చలు జరిగాయి. కానీ వారిది కేవలం ఫ్రెండ్‌షిప్ అనే చెప్పుకొచ్చారు. అయితే పునర్నవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది.. ట్రోలింగ్‌కు ఎలా సమాధానం చెబుతుందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్లకు అంతే స్థాయిలో సమాధానం చెబుతూ ఉంటుంది. అంతే కాకుండా తన ఫోటోలపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ రాసే వార్తలపైనా పునర్నవి ఫైర్ అవుతూ ఉంటుంది.

పునర్నవి పిక్స్ వైరల్

ఆ మధ్య తన ఫోటోలపై మీడియా రాసిన కథనాలపై పునర్నవి మండిపడిన సంగతి తెలిసిందే. యోగా చేస్తున్న ఫోటోలపై అలాంటి కామెంట్లు చేస్తూ వార్తలు రాయడంపై పునర్నవి ఫైర్ అయింది. పునర్నవి ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవం ఈవెంట్‌లో సందడి చేస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి స్టార్ మా చేస్తోన్న ఈ స్పెషల్ ఈవెంట్ కోసం గ్రాండ్‌గా సెట్ వేసినట్టు కనిపిస్తోంది. ఇందులో పునర్నవి కూడా రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. అక్కడ ధరించిన క్యాస్టూమ్స్‌తో తాజాగా ఫోటో షూట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పునర్నవి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp