punch prasad remuneration and his monthly income
Punch Prasad : ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని చూసుకొని కృంగి పోయే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ జబర్దస్త్ లో కొందరు ఉన్నారు… వారిలో ఉన్న లోపాన్ని జనాలకు చెబుతూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఇమాన్యుల్ చూస్తే నల్లగా ఉండి జుట్టు సరిగా ఉండదు. అయినా కూడా తన కలర్ మరియు తన జుట్టు గురించి జోకులు వేస్తూ వేయించుకుంటూ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక నూకరాజు ఇతర కమెడియన్స్ అంతా కూడా తమలో ఉన్న లోపాన్ని చూపించుకుంటూ నే పాపులారిటీని సొంతం చేసుకొని సక్సెస్ అయ్యారు. జబర్దస్త్ లో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రసాద్ ఇప్పుడు పంచ్ ప్రసాద్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.
ఆ మధ్య పంచ్ ప్రసాద్ ( punch prasad) యొక్క ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకు ఏకంగా ప్రాణాపాయం ఉందంటూ వైద్యులు చెప్పారు. ఆ సమయంలో తనకు బాసటగా నిలిచిన యువతిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈటీవీలో దాదాపు అన్ని షోస్ లో కనిపిస్తున్నాడు. తన భార్య మరియు పాపను కూడా తీసుకుని వస్తే తన మీద.. తన ఆరోగ్యం మీద.. భార్య మీద జోకులు వేస్తూ నవ్విస్తూ ఉన్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, ప్రత్యేక ఈవెంట్స్ ఇలా అన్ని చోట్ల కూడా పంచ్ ప్రసాద్ కనిపిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఒకానొక సమయంలో హాస్పిటల్ ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బంది పడ్డ పంచ్ ప్రసాద్ ఇప్పుడు నెలకు మూడున్నర లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట.
punch prasad remuneration and his monthly income
అందులో లక్షన్నర రూపాయలు తన హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగించుకుంటున్నాడని సమాచారం అందుతుంది. జబర్దస్త్ టీం మెంబెర్స్ మరియు కొందరి దాతల కారణంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ లో వైద్యం ఖర్చు చాలా తక్కువగా ఉందట. సదరు హాస్పిటల్ వారు చాలా తక్కువ మొత్తానికి చికిత్స అందిస్తున్నారట. కనుక ప్రతి నెల కూడా పంచ్ ప్రసాద్ తన ఆదాయంతో బ్యాంకు బ్యాలెన్స్ ని భారీగా పెంచేసుకుంటున్నాడు. ఇదంతా కేవలం అతడి లోపం కారణంగానే అనడంలో సందేహం లేదు. తన అనారోగ్యం చూసుకొని తనకు తాను బాధపడి ఇంట్లోనే ఉండి ఉంటే కచ్చితంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు.. కనుక ఈ తరం యువత తప్పకుండా పంచ్ ప్రసాద్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని తమలో ఉన్న లోపాలను ఇబ్బందులను అధిగమించి కెరియర్ లో ముందుకు సాగి సక్సెస్ అవ్వాలి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.