Punch Prasad : పంచ్‌ ప్రసాద్‌ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 30, 2022, 9:30 pm

Punch Prasad : ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని చూసుకొని కృంగి పోయే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ జబర్దస్త్ లో కొందరు ఉన్నారు… వారిలో ఉన్న లోపాన్ని జనాలకు చెబుతూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఇమాన్యుల్ చూస్తే నల్లగా ఉండి జుట్టు సరిగా ఉండదు. అయినా కూడా తన కలర్‌ మరియు తన జుట్టు గురించి జోకులు వేస్తూ వేయించుకుంటూ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక నూకరాజు ఇతర కమెడియన్స్ అంతా కూడా తమలో ఉన్న లోపాన్ని చూపించుకుంటూ నే పాపులారిటీని సొంతం చేసుకొని సక్సెస్ అయ్యారు. జబర్దస్త్ లో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రసాద్ ఇప్పుడు పంచ్ ప్రసాద్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

ఆ మధ్య పంచ్ ప్రసాద్ ( punch prasad)  యొక్క ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకు ఏకంగా ప్రాణాపాయం ఉందంటూ వైద్యులు చెప్పారు. ఆ సమయంలో తనకు బాసటగా నిలిచిన యువతిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈటీవీలో దాదాపు అన్ని షోస్ లో కనిపిస్తున్నాడు. తన భార్య మరియు పాపను కూడా తీసుకుని వస్తే తన మీద.. తన ఆరోగ్యం మీద.. భార్య మీద జోకులు వేస్తూ నవ్విస్తూ ఉన్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, ప్రత్యేక ఈవెంట్స్ ఇలా అన్ని చోట్ల కూడా పంచ్ ప్రసాద్ కనిపిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఒకానొక సమయంలో హాస్పిటల్ ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బంది పడ్డ పంచ్ ప్రసాద్ ఇప్పుడు నెలకు మూడున్నర లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట.

punch prasad remuneration and his monthly income

punch prasad remuneration and his monthly income

అందులో లక్షన్నర రూపాయలు తన హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగించుకుంటున్నాడని సమాచారం అందుతుంది. జబర్దస్త్ టీం మెంబెర్స్ మరియు కొందరి దాతల కారణంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ లో వైద్యం ఖర్చు చాలా తక్కువగా ఉందట. సదరు హాస్పిటల్ వారు చాలా తక్కువ మొత్తానికి చికిత్స అందిస్తున్నారట. కనుక ప్రతి నెల కూడా పంచ్ ప్రసాద్ తన ఆదాయంతో బ్యాంకు బ్యాలెన్స్ ని భారీగా పెంచేసుకుంటున్నాడు. ఇదంతా కేవలం అతడి లోపం కారణంగానే అనడంలో సందేహం లేదు. తన అనారోగ్యం చూసుకొని తనకు తాను బాధపడి ఇంట్లోనే ఉండి ఉంటే కచ్చితంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు.. కనుక ఈ తరం యువత తప్పకుండా పంచ్ ప్రసాద్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని తమలో ఉన్న లోపాలను ఇబ్బందులను అధిగమించి కెరియర్ లో ముందుకు సాగి సక్సెస్ అవ్వాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp