
punch prasad serious comments on sudigali sudheer and his fans
Sudigali Sudheer :ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో వారం వారం మంచి రేటింగ్ ను దక్కించుకుంటూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పొందుతోంది.. సూపర్ రేటింగ్ తో దూసుకు వెళ్తుంది. ప్రతి వారం కూడా విభిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్ నవ్వులు పూయించడంతో పాటు సెంటిమెంటుతో గుండెలను కరిగిస్తారు. అద్భుతమైన ఈ షో కు సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఈటీవీ స్థాయిని మరో పది రెట్లు పెంచుతుంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చే ఆదివారం ఎపిసోడ్ విషయానికి వస్తే అలీబాబా 25.5 దొంగలు అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ప్రతి వారం ఒక గెస్ట్ వచ్చినట్లుగానే వచ్చే వారం ఎపిసోడ్ కు సీనియర్ హీరో అప్పట్లో అమ్మాయిల్లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న వెంకట్ సందడి చేయబోతున్నాడు. ఇక ప్రతివారం లాగే వచ్చే వారం ఎపిసోడ్ లో కూడా సుదీర్ తనదైన శైలిలో ఆకట్టుకోబోతునట్లుగా ప్రోమోలో కనిపిస్తుంది. అలీ బాబా దొంగల ముఠా నాయకుడిగా సుధీర్ కనిపించబోతున్నట్లుగా ఆయన గెటప్ మరియు ఆయన పాత్ర చూస్తుంటే అర్థం అవుతుంది. మామూలుగా సుధీర్ పై పంచులు వేయాలంటే లేదా ఆయన్ని తిట్టాలంటే కమెడియన్స్ భయపడతారు. కానీ ఈ ఎపిసోడ్ లో పంచ్ ప్రసాద్ ఓరేంజ్ లో సుధీర్ ను ఏకి పారేశారు. ప్రసాద్ ఏదో పంచ్ వేస్తే దానికి సుధీర్ అడ్డుపడటంతో అతడు చాలా హర్ట్ అయినట్లు కనిపించింది.
punch prasad serious comments on sudigali sudheer and his fans
పంచ్ ప్రసాద్ సీరియస్ గా ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను ఈ రోజు ఏకి పారేస్తాను.. నీ ఫ్యాన్స్ నా విగ్ కూడా పీకలేరు అంటూ తన తలపై ఉన్న విగ్ ను పీకి అవతల పారేశాడు. ఈ మొత్తం వ్యవహారం కేవలం కామెడీ కోసమే జరిగి ఉంటుంది. కానీ సుధీర్ అభిమానులు ఈ వ్యవహారంలో తీవ్రంగా హర్ట్ అయి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ ని కచ్చితంగా కామెంట్స్ రూపంలో సుధీర్ ఫ్యాన్స్ ఏకి పారేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు పంచ్ ప్రసాద్ రెడీ అయ్యే సుడిగాలి సుధీర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు… అలాగే ఫ్యాన్స్ ని కూడా తిట్టి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఏం చేసిన కామెడీ కోసమే.. ఏం చూపించిన కామెడీ కోసమే. కనుక ప్రేక్షకులు సాధారణంగానే తీసుకుంటారని భావిద్దాం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.