Home » Entertainment » Puri Jagannadh Answer To Chiranjeevi About Auto Jhonny
Entertainment

Chiranjeevi : చిరంజీవి షాక్ అయ్యే సమాధానం ఇచ్చి కక్ష తీర్చుకున్న పూరి జగన్నాథ్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 14, 2022 12:36 pm
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేయాలనుకున్నాడు. కానీ చిరంజీవి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆటో జానీ అనే కథ ను చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు రెడీ చేశాడు. ఆ కథ ను చిరంజీవి కి పూరి జగన్నాథ్ వినిపించడం కూడా జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అంటూ స్వయంగా చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశాడట. సెకండ్ హాఫ్ విషయంలో కాస్త మార్పులు చేర్పులు కావాలని సూచించాడట. తప్పకుండా చేద్దాం అంటూ పూరి జగన్నాధ్‌ ఆ పనిలో ఉండగానే చిరంజీవి తన 150వ సినిమాను వీవీ వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 అంటూ అధికారికంగా ప్రకటించాడు.

Advertisement

పూరి జగన్నాధ్‌ కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదట. ఆ విషయాన్ని పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తన కథ బాగుంది అన్నారు.. సెకండాఫ్ రెడీ చేస్తున్న సమయంలో కనీసం నాతో చెప్పకుండా నా సినిమా ను క్యాన్సల్ చేసుకోవడం బాధను కలిగించిందని, చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను.. ఆయనతో సినిమా చేసే అవకాశం ఇప్పుడు కాకుండా మళ్లీ అయినా వస్తుంది కానీ 150 సినిమా అవకాశం చేజారటంతో తీవ్రంగా అసంతృప్తి కలిగిందంటూ పూరి జగన్నాథ్ గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో పూరి జగన్నాథ్ కనిపించాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు దాదాపుగా తొలగిపోయినట్లే అంటూ అంతా భావించారు.

Puri Jagannadh answer to chiranjeevi about auto jhonny

Advertisement

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇంకా తన మనసులో చిరంజీవిపై కోపం పెంచుకున్నట్లుగానే అనిపిస్తుంది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయిన నేపథ్యం లో పూరి జగన్నాథ్ కి ఒక ఇంటర్వ్యూను చిరంజీవి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నా ఆటో జానీ కథ ఏమైంది అంటూ చిరంజీవి ప్రశ్నించిన సమయంలో అంతకు మించిన మంచి కథ రెడీ చేస్తున్నాను అన్నట్లుగా ఆటో జానీ కథను మీకు ఇచ్చేది లేదు అంటూ చిరంజీవికి చెప్పకనే చెప్పాడు. అప్పుడు ఆటో జానీ కథ ను తిరస్కరించినందుకు గాను ఇప్పుడు ఇంటర్వ్యూలో చిరంజీవికి కౌంటర్ ఇచ్చి ఆటో జానీ కథ గురించి మర్చి పోవాలని పూరి జగన్నాథ్ చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి