Chammak Chandra : ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ పది సంవత్సరాలకు చెందిన ఎపిసోడ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఈటీవీ ఉంచింది. అన్ని జబర్దస్త్ స్కిట్స్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టీం లీడర్ స్కిట్ ఏదైనా ఉంది అంటే అది చమ్మక్ చంద్ర స్కిట్స్ మాత్రమే అంటూ ఈటీవీ వర్గాల వారు చెబుతున్నారు. మళ్లీ మళ్లీ రీ షేర్ చేసిన కూడా చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్స్ మిలియన్స్ కొద్ది వ్యూస్ ని దక్కించుకుంటూనే ఉన్నాయి. హైపర్ ఆది ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. చమ్మక్ చంద్ర ఈటీవీ మల్లెమాల జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి చాలా కాలమే అయింది, అయినప్పటికీ ఇంకా చమ్మక్ చంద్ర నే నెంబర్ వన్ గా ఉన్నాడు అంటే ప్రేక్షకులు అతడిని ఎంతగా కోరుకున్నారో అతడిని ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
చమ్మక్ చంద్ర స్కిట్స్ ఒక టాబ్లెట్ మాదిరిగా బీపీ తగ్గిస్తుంది అంటూ చాలా మంది అప్పుడు ఇప్పుడు చెబుతూనే ఉంటారు. గతంలో చూసిన వాళ్లు మళ్లీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చూసేందుకు.. ఈ టీవీలో అప్పుడప్పుడు రీ టెలికాస్ట్ అవుతుంటే చూసేందుకు రెడీ అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం చమ్మక్ చంద్ర అంటూ గతంలో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 10 నుండి 15 ఎపిసోడ్స్ మాత్రమే జబర్దస్త్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మల్లెమాల వారు భావించారు, కానీ జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర లేడీ గెటప్ వేసి ఒక్క సారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
రికార్డ్ స్థాయి రేటింగ్ దక్కడంతో ఈటీవీ వారు కానీ మల్లెమాల వారు కానీ జబర్దస్త్ ని ఆపేయాలని ఆలోచన చేయకుండా గత పది సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ లో వచ్చారు చేశారు, వెళ్లారు. చమ్మక్ చంద్ర కూడా సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ లో కొనసాగి వెళ్లి పోయాడు. అయితే ఇప్పటికి కూడా ఆయనకు జబర్దస్త్ చమ్మక్ చంద్ర అన్నట్లుగానే పేరు ఉంది. ఆయన నటించిన కామెడీ స్కిట్స్ యూట్యూబ్లో విపరీతమైన ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కొక్క కామెడీ స్కిట్ కి మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కాయి. అందుకే చమ్మక్ చంద్ర వీడియోలు అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న జబర్దస్త్ వీడియోలు గా పేరు దక్కించుకున్నాయి. ముందు ముందు హైపర్ ఆది వీడియోలు చమ్మక్ చంద్ర వీడియోలని బ్రేక్ చేస్తాయేమో చూడాలి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.