Pushpa 2 Kissik Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 November 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 Kissk Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!

Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా నుంచి ఇదివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఐతే సినిమా నుంచి స్పెషల్ ఐటం సాంగ్ గా కిసిక్ సాంగ్ ఈమధ్యనే రిలీజ్ చేశారు. పుష్ప 2 లో ఐటం సాంగ్ ఎవరు చేస్తారా అంటూ ఒక రేంజ్ లో చర్చ జరగ్గా చివరకు వాళ్లు వీళ్లు అంటూ శ్రీలీలకి ఫిక్స్ అయ్యారు. ఆమెతోనే వారం రోజుల్లో ఈ సాంగ్ షూట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఐతే కిసిక్ సాంగ్ రిలీజ్ అయ్యాక సాంగ్ విన్న ఆడియన్స్ ఇది సమంత ఉ అంటావా సాంగ్ రేంజ్ లో లేదని ఫీల్ అయ్యారు. ఐతే రిలీజై రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ సాంగ్ చిన్నగా ఎక్కేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ సాంగ్ వినిపిస్తుంది. అంతేకాదు రీల్స్, ప్రమోషన్స్ అన్నిట్లో దీన్ని వాడేస్తున్నారు.

Pushpa 2 Kissik Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!

Pushpa 2 Kissik Song : పుష్ప 2 దెబ్బలు పడతాయ్ రోయ్.. చిన్నగా ఎక్కుతుందిగా..!

Pushpa 2 Kissik Song ఎన్నో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చినా..

ఐతే ఈ సాంగ్ లో చేయడం గురించి శ్రీలీల తన అసలు విషయాన్ని చెప్పింది. పుష్ప 2 సాంగ్ చాలా స్పెషల్ అని ఎన్నో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చినా తాను చేయలేదని కాకపోతే ఈ సాంగ్ మాత్రం కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. అసలు ఈ సాంగ్ తానెందుకు చేశానో డిసెంబర్ 5న అందరికీ అర్ధమౌతుందని అన్నది. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 1 లో తనకు డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు కానీ పార్ట్ 2 లో తన నుంచి మీరు ఆశించే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని చెప్పాడు.

పాట్నాతో మొదలు పెట్టిన పుష్ప 2 ప్రమోషన్స్ చెన్నై, కొచ్చి ఇలా దేశమంతా కవర్ చేస్తున్నారు. సినిమాకు వస్తున్న బజ్ చూస్తుంటే మాత్రం భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక సూపర్ హిట్ టాక్ వచ్చింది అంటే మాత్రం 1000 కోట్లు కొట్టడం పక్కా అనిపిస్తుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపించబోతున్నాడని చెప్పొచ్చు. Pushpa 2 Kissk Song Trending in All Over Social Media ,

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి