Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!

Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి ఇంకా కొతమంది సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 6న అనుకున్న పుష్ప 2 ని ఒకరోజు ముందుకు అంటే డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. సుకుమార్ ఈ సినిమాను ఆడియన్స్ ఎన్ని భారీ అంచనాలతో వస్తారో […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!

Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి ఇంకా కొతమంది సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 6న అనుకున్న పుష్ప 2 ని ఒకరోజు ముందుకు అంటే డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. సుకుమార్ ఈ సినిమాను ఆడియన్స్ ఎన్ని భారీ అంచనాలతో వస్తారో దానికి మించి ఉండేలా కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఐతే నిర్మాతలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా గురించి ఒక ప్రశ్న వచ్చింది. ఐతే బన్నీకి రాజకీయాలతో సంబంధం లేదని ఆయన ఆ టైం లో ఏదో అలా చేశారని అన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్ల విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నారని అన్నారు.

Allu Arjun జానీ మాస్టర్ తో ఒక పాట..

ఇక జానీ మాస్టర్ తో ఒక పాట చేయించాల్సి ఉన్నా ఆయన చేయడం కుదరదని అది వేరే వాళ్లకి ఇచ్చేశామని అన్నారు నిర్మాతలు. జానీ మాస్టర్ ఈమధ్యనే ఒక కేసు విషయంలో అరెస్ట్ అయ్యారని తెలిసిందే. ఐతే ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడకూడదు అనుకుని ఆయన్ను సినిమా నుంచి తప్పించేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.

Allu Arjun అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు పవన్ ఉన్నాడుగా జానీకి ఆ ఛాన్స్ మిస్

Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!

పుష్ప 2 కోసం 3 ఏళ్లు టైం తీసుకోవడం గురించి నిర్మాతలు స్పందిస్తూ సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారని అదంతా స్క్రీన్ మీద మీరు చూస్తారని అన్నారు. మరి పుష్ప 2 పై నిర్మాతల వెర్షన్ ఇలా ఉంది. సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది