
Pushpa 2 The Rule : అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొట్టిన పుష్ప2.. బాహుబలి,ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డ్స్ అన్ని బ్రేక్
Pushpa 2 The Rule : ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప.. పుష్పరాజ్ హంగామా నడుస్తుంది. సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచం వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. గత రాత్రి హైదరాబాద్‌లో మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగగా, ఈ వేడుకకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ నిపుణులు చెబుతున్నారు.
Pushpa 2 The Rule : అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొట్టిన పుష్ప2.. బాహుబలి,ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డ్స్ అన్ని బ్రేక్
ఇక తెలంగాణలో శనివారం సాయంత్రం బుకింగ్స్ స్టార్ట్ కాగా, కేరళలో డిసెంబర్ 1న అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక నిన్న అయితే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో రికార్డులు సృష్టించింది పుష్ప 2. ఏకంగా 60 వేల కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలిరోజే ఏకంగా 2.80 లక్షల పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇది నిజంగా సూపర్ డూపర్ రికార్డ్ అనే చెప్పాలి. టైటిల్ కి తగ్గట్టే పుష్ప రికార్డులు సృష్టిస్తూ రూల్ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా పుష్పాకి టికెట్లు తెగుతూనే ఉన్నాయి. ఇక పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్ లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇండియాలోనే 6,500, ఓవర్సీస్ లో 500 స్క్రీన్స్ లలో విడుదలకు సిద్ధమైంది. ఇది ఇండియా చరిత్రలోనే అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది.
ఈ భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా విదేశాలలో కూడా తన మార్క్ ను క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా 50 వేల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప 2. అత్యధిక వేగంగా బుక్ మై షో లో 1 మిలియన్ టికెట్లను అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా అడ్వాన్స్ బుకింగ్‌లలో రూ.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.దీని బట్టి.. ‘కల్కి 2898 ఏడీ’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్స, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి సినిమాల రికార్డులు బ్రేక్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.