pushpa moive : పుష్ప రాజ్ మాస్ జాతర.. థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ మామూలుగా లేదుగా..!
pushpa moive : తెలుగు ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ది మోస్ట్ అవైటింగ్ మూవీ ఆఫ్ ద ఇయర్… పుష్ప థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. రూ 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఆ మెత్తాన్ని ప్రీ రిజీజ్ బిజినెస్ లోనే రాబట్టుకుని సినీ పరిశ్రమ మొత్తాన్ని అవాక్కయ్యేలా చేసింది. 3 వేలకు పైగా స్క్రీన్ లలో రిలీజ్ అయి దుమ్ము దులిపేస్తోంది ఈ సినిమా. సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ రివ్యూ ప్రకారం చూస్తే.. పుష్ప ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందనే టాక్ వినిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సినిమా థియేటర్ల ముందుఅల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు.
pushpa moive : థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ..!

pushpa moive Allu arjun fans hangama at theaters
సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండు రాష్ట్రల్లో స్టైలిష్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సినిమా హాల్ లో పుష్ప ఎలివేషన్ సీన్లకు విజిల్స్ మీద విజిల్స్ పడుతున్నాయి. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాటలకు అభిమానులు సీట్లలో కూర్చోవడం లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రధానంగా బన్నీ డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్, మాస్ సీన్స్… మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. సమంత మాస్ స్టెప్పులు కుర్రకారుకి మంచి కిక్ ఇస్తున్నాయి.ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే పుష్ప రాజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేటట్టే కనిపిస్తున్నాడు.
pushpa moive : బాక్సాఫీస్ షేక్..!
కరోనా కారణంగా మూలకు పడ్డ థియేటర్లలో సైతం బన్నీ జాతర మామూలుగా లేదు. బాహుబలి అనంతరం ఆ రేంజ్ కలెక్షన్ లతో పాటు తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించేటట్లు కనిపిస్తున్నాడు ఈ పుష్ప రాజ్. ఏది ఏమైనా ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని సత్తాని మరోమారు ఇండియా వైడ్ గా రుజువు చేస్తోంది. సినిమా 179 నిమిశాల నిడివితో ఉన్నా ఎక్కడ బోర్ కొట్టకుండా అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఇప్పటికే ప్రీమియర్ షో లు చూసినవారు చెబుతున్నారు.
Pushpa FDFS celebrations at Ravi theatre kadapa #PushpaTheRiseOnDec17th #AlluArjun #ThaggedheLe pic.twitter.com/Ra5tpTqkUO
— Prasad Reigns ✊ (@Prasad22997446) December 17, 2021