pv sindhu stylish dance video viral
Pv Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోర్ట్‌లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులని వణికిస్తున్న సింధు సోషల్ మీడియాలో కూడా వినోదం పంచుతూ ఉంటుంది. క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేయడమే కాక, ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. సింధు ట్రెండ్‌కి తగ్గట్టు సందడి చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంతకముందు కూడా ఈ అమ్మడు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ పలు వీడియోలు షేర్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలోని సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేస్తూ వినోదం పంచింది. గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకుల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గార్బా డ్యాన్స్ చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలిగింది. తొందర్లోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రావాలని చూస్తోంది. డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతుండగా, అభిమానులు తప్పక గెలవాలని కోరుతున్నారు.
pv sindhu stylish dance video viral
ఇక ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా… ‘చాలా మంది హీరోలు ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మేము మంచి స్నేహితులం కూడా’ అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు. సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని హోస్ట్ అడగ్గా.. ‘ఏమో నా బయోపిక్ ఉండొచ్చేమో. అందులో నేనే హీరోయిన్‌గా చేస్తానేమో’ అని నవ్వుతూ బదులిచ్చారు. లవ్ లెటర్స్ గురించి అడగ్గా.. తనకు ఇప్పటివరకు ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని, అందులో ఓ 70 ఏళ్ల వ్యక్తి రాసిన లెటర్ కూడా ఉందని సింధు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని కూడా రాశాడని చెప్పుకొచ్చారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.