అది కరెక్ట్ పద్దతి కాదు.. ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ వైరల్
ఆర్ నారాయణ మూర్తి తన ప్రసంగాల్లో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా గురించి ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఆ మధ్య ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. సినిమా గురించి మాట్లాడటమే కాదు.. సినిమా టికెట్ ధరలు పెంచే విషయంలోనూ అందరికీ సందేశమిచ్చాడు. సినీ పెద్దలను కోరాడు.
సోలో బ్రతుకే సినిమాకు వస్తున్న ఆదరణను చూసిన తర్వాత మన తెలుగులోనే కాదు.. ఎంటైర్ సినీ ఇండస్ట్రీకి తమ సినిమాను విడుదల చేసుకోగలమనే ధైర్యం వచ్చింది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో నేను ఇచ్చే సలహా ఒకటే. ఎవరూ టికెట్ ధర పెంచవద్దని నా మనవి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. కానీ.. సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాడంటూ ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చాడు.
కాబట్టి ఎంత పెద్ద బడ్జెట్ మూవీ అయినా టికెట్ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్స్ రేట్స్ పెంచమని అడగడం కరెక్ట్ కాదు. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి సినిమా టికెట్ రేట్స్ పెంచకండి. సీఎం కేసీఆర్ గారు, వైఎస్ జగన్ గార్లను టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను అంటూ ఆర్ నారాయణ మూర్తి నిజమైన పిపుల్ స్టార్ అని నిరూపించుకున్నాడు.