Raashi Khanna : మెరుపుతీగ‌లా మారిన రాశీఖ‌న్నా.. ఆ అందాల‌కు మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: June 10, 2022, 4:30 pm

Raashi Khanna : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైంది. తొలి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిచ అందరినీ ఆకట్టుకుంది రాశి. ఆ తర్వాత.. తన లుక్ లో ఛేంజ్ తీసుకువచ్చింది రాశి. ఇప్పుడు సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది. ఇప్పటికీ ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.

తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న రాశి ఖన్నా సూపర్ స్టైలిష్ గా, అంతకు మించి అన్న‌ట్టుగా ఉన్నాయి. రాశి ఖన్నా చివరగా ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో మెరిసింది. రాశి ఖన్నా తన అందంతో, క్యూట్ లుక్స్, నటనతో ఈ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాశి ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా ఉంది.

raashi khanna beautiful looks are stunning

raashi khanna beautiful looks are stunning

Raashi Khanna : రాశీ ఖ‌న్నా బ్యూటీ ఫుల్ లుక్స్..

రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో వరుస విజయాలు దక్కుతాయని రాశి భావిస్తోంది. ఇవి రెండు విజ‌యం సాధిస్తే రాశీ ఖ‌న్నా క్రేజ్ మ‌రో లెవ‌ల్‌కి వెళ్ల‌డం ఖాయం. అయితే సన్నగా మారేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రాశి ఖన్నా.. తన ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు.. తాను తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp