Raashi Khanna : గాయపడ్డ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఆందోళనలో అభిమానులు
ప్రధానాంశాలు:
Raashi Khanna : గాయపడ్డ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఆందోళనలో అభిమానులు
Raashi Khanna : అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ చిన్నది ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులో వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా వరసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

Raashi Khanna : గాయపడ్డ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఆందోళనలో అభిమానులు
Raashi Khanna అయ్యో పాపం..
అయితే రాశీఖన్నా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా షూటింగ్‌లో రిహార్సిల్స్ చేస్తుండగా గాయపడ్డారు. రాశీ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టు చేశారు. ఒక్కో సారి కథ డిమాండ్ చేస్తే గాయాలను చేయకుండా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. షూటింగ్ చేస్తుండగా చిన్న చిన్న గాయాలయ్యాయని ఆమె తెలిపారు. ఆ ఫొటోల్లో రాశీ ఖన్నా ముఖం, చేతులపై గాయాలు ఉన్నాయి. ఫర్జీ-2 అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తోంది.
రాశీ ఖన్నా గాయపడడంతో ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రిష్క్ షాట్లు చేసేటప్పుడు డూప్ ను పెట్టుకుంటే బాగుంటుందని అభిమానులు ఆమెకు సలహా ఇస్తున్నారు. ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్, కోలీవుడ్ చెక్కేసి అక్కడ వరస సినిమాలతో దూసుకెళ్తుంది.