Panchuko Song : పంచుకో సాంగ్ విడుద‌ల‌.. రాశీ ఖ‌న్నా, త‌మ‌న్నా అందాల విందు మాములుగా లేదుగా.. వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Panchuko Song : పంచుకో సాంగ్ విడుద‌ల‌.. రాశీ ఖ‌న్నా, త‌మ‌న్నా అందాల విందు మాములుగా లేదుగా.. వీడియో !

Panchuko Song  : అందాల ముద్దుగుమ్మ‌లు క్రేజీ లుక్స్‌తో క‌నిపిస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అరణ్మనై 4 చిత్రం హార్రర్‌ కామెడీ జోనర్‌లో తెర‌కెక్కుతుండ‌గా, పాపులర్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ సుందర్ సి స్వీయదర్శకత్వంలో హీరోగా ఈ మూవీ రూపొందుతుంది.. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీని తెలుగులో బాక్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది.తాజాగా చిత్రం నుండి […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Panchuko Song : పంచుకో సాంగ్ విడుద‌ల‌.. రాశీ ఖ‌న్నా, త‌మ‌న్నా అందాల విందు మాములుగా లేదుగా.. వీడియో !

Panchuko Song  : అందాల ముద్దుగుమ్మ‌లు క్రేజీ లుక్స్‌తో క‌నిపిస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అరణ్మనై 4 చిత్రం హార్రర్‌ కామెడీ జోనర్‌లో తెర‌కెక్కుతుండ‌గా, పాపులర్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ సుందర్ సి స్వీయదర్శకత్వంలో హీరోగా ఈ మూవీ రూపొందుతుంది.. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీని తెలుగులో బాక్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది.తాజాగా చిత్రం నుండి మేకర్స్‌ పంచుకో సాంగ్‌ను లాంఛ్ చేశారు. రాశీఖన్నా, తమన్నా మధ్య కలర్‌ఫుల్‌గా సాగే ఈ పాట.. ఇద్దరు భామల అందాల కనువిందుతో ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.
అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయారుగా..

ఈ సాంగ్ ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుండ‌గా, ఇందులోని త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా లుక్స్ కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారుతున్నాయి. అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ చిత్రంకి సంబంధించి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. తమన్నా సంప్రదాయ చీరకట్టులో చేతిలో హారతి పట్టుకొని ఉన్న శివాని లుక్‌ ఆకట్టుకుంది. ఇక సుందర్‌ సి ఇందులో శివశంకర్‌గా కనిపించబోతున్నాడు. స్పైన్ ఛిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్‌, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హిప్ హాప్‌ తమిఝా మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

Panchuko Song పంచుకో సాంగ్ విడుద‌ల‌ రాశీ ఖ‌న్నా త‌మ‌న్నా అందాల విందు మాములుగా లేదుగా

Panchuko Song : పంచుకో సాంగ్ విడుద‌ల‌.. రాశీ ఖ‌న్నా, త‌మ‌న్నా అందాల విందు మాములుగా లేదుగా..!

ఇద‌ద‌రు హీరోయిన్స్ ఒకే సినిమాలో గ్లామ‌ర‌స్‌గా కనిపిస్తూ ఉండ‌డంతో మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతానికి విడుద‌లైన సాంగ్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఒకానొక సంద‌ర్బంలో ‘అరణ్మనై’ చిత్రం తన సినీ కెరీర్‌లోనే కాకుండా, జీవితంలో ఎంతో ముఖ్యమైన మూవీ అని దర్శకుడు సుందర్ సి అన్నారు. ‘అరణ్మనై’ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘అరణ్మనై-4’ ట్రైల‌ర్ కార్య‌క్ర‌మంలో సుంద‌ర్ మాట్లాడుతూ.. ‘అరణ్మనై’ చిత్రాలకు కంటే భిన్నంగా ఈ ‘అరణ్మనై 4’ ఉంటుందని అన్నా

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది